ఇండియాను వణికించిన ప్లేయర్ పై.. ఐపీఎల్ ఫ్రాంచైజీ కన్ను?

praveen
బీసీసీఏ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యుత్తమ ఆటగాళ్లకు వేదికగా మారిపోతూ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో బాగా రాణిస్తున్న ఆటగాళ్లు అందరూ కూడా ఐపీఎల్ లో కనిపిస్తూ ఉంటారు. ఏకంగా అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యార్థులుగా ఉన్నవారు అటు ఐపిఎల్ లో మాత్రం సహచరులుగా మారిపోతూ మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఆయా జట్ల ఫ్రాంచైసీలు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న ఆటగాల్లను తమ జతలోకి తీసుకోవాలని పోటీ పడుతూ ఉంటాయి.



 ఇకపోతే ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఇక వచ్చే యేడాది ఐపీఎల్ సీజన్ కోసం అటు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే అటు ఫ్రాంచైసీలు కూడా వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ జట్టులోకి మంచి ప్రతిభ ఉన్న ప్లేయర్లను తీసుకొని ఇక టైటిల్ గెలవడమె లక్ష్యంగా బలిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయ్. ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాల్లను వదులుకోవడమే కాదు మరి కొంతమందిని కొనుగోలు చేసేందుకు కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్ అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల ఏకంగా వరల్డ్ కప్ లో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన ఒక ఆటగాడిపై ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను పడింది అన్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల టీం ఇండియాతో జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లోనే మూడు సిక్సర్లు ఏడు ఫోర్ ల సహాయంతో 60 పరుగులు చేసి ఏకంగా టీమ్ ఇండియా నే వనికించిన బంగ్లాదేశ్ బ్యాటర్ లీటన్ దాస్ అందరి మన్ననలు పొందుతున్నాడు. అయితే అతని దక్కించుకోవడానికి కోల్కతా నైట్ రైడర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే లిటన్ దాస్ పూర్వీకులు అటు బెంగాల్ కు చెందిన వారే కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: