వావ్.. టీమిండియా మరో బుమ్రా దొరికేశాడు?

praveen
దాదాపు 15 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేసి ఇక విశ్వవిజేతగా నిలవాలని భావించిన టీమిండియా కు వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఊహించని రీతిలో బిగ్ షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే జట్టులో విన్నింగ్ బౌలర్ గా పేరు సంపాదించుకున్న బుమ్రా  వెన్నునొప్పి గాయం కారణంగా ఇక వరల్డ్ కప్ మొత్తానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అతను పూర్తిగా కోలుకోక ముందే బుమ్రాతో వరల్డ్ కప్ ఆడించాలని ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు. దీంతో బుమ్రా లేకుండానే వరల్డ్ కప్ లో బరిలోకి దిగింది టీం ఇండియా .

 బుమ్రా లాంటి కీలక బౌలర్ లేకుండా అటు టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అని అందరూ భావించారు.. బుమ్రా లోటును భర్తి చేసే బౌలర్ ఎవరు అని ఆలోచనలో పడిపోయారు. ఇక ఇప్పుడు బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే బౌలర్ దొరికాడు అని భారత అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోతూ ఉన్నారు. ఇక ఆ బౌలర్ ఎవరో కాదు మొదటిసారి వరల్డ్ కప్ ఆడుతున్న అర్షదీప్ సింగ్. అతనికి వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కూడా అర్షదీప్ మాత్రం ఎంతో అనుభవజ్ఞుడైన బౌలర్ లాగా వైవిధ్యమైన బంతులతో అద్భుతాలే సృష్టిస్తున్నాడు అని చెప్పాలి.

 సీనియర్ బౌలర్లుగా ఉన్న భువనేశ్వర్ కుమార్,మహమ్మద్ షమీలకు సైతం వికెట్లు తీయడం సాధ్యం కాని పిచ్ లపై అర్షదీప్ వరుసగా వికెట్లు తీస్తూ అటు జట్టుకు విజయాలను అందిస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు టీమిండియా నాలుగు మ్యాచ్లు ఆడగా నాలుగు మ్యాచ్లలో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 9 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే డెత్ ఓవర్లలో కూడా ఒత్తిడిని చిత్తు చేస్తూ అతడు బౌలింగ్ చేస్తున్న తీరు అందరిని ఫిదా చేసేస్తూ ఉంది. దీంతో టీమిండియాకు మరో బుమ్రా దొరికాడు అంటూ ఎంతోమంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: