గాయం.. దినేష్ కార్తీక్ జట్టుకు దూరం?

praveen
కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత అటు టీమిండియాలోకి అడుగుపెట్టిన దినేష్ కార్తీక్ తన అద్భుతమైన ప్రదర్శనతో అసలు సిసలైన ఫినిషర్గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది యువ ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నప్పటికీ అటు సెలెక్టర్లు మాత్రం 37 ఏళ్ల దినేష్ కార్తీక్ వైపే మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో భాగంగా దినేష్ కార్తీక్ భారత విజయంలో కీలకపాత్ర వహిస్తాడు అనే కారణంతో అతని జట్టులోకి సెలక్ట్ చేశారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇలా భారత జట్టులోకి భారీ అంచనాల మధ్య వచ్చిన దినేష్ కార్తీక్ అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. మొదటి రెండు మ్యాచ్లలో కూడా పెద్దగా ఆడేందుకు అవకాశం రాని దినేష్ కార్తీక్ కూ.. ఇటీవల అటు సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో మాత్రం మంచి అవకాశం వచ్చినా కూడా తనని తాను నిరూపించుకోలేకపోయాడు. తక్కువ పరుగులు మాత్రమే చేసి చివరికి వికెట్ కోల్పోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని ఆట తీరుపై అందరూ విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం.



 అయితే కెరీర్ లో ఏదో సాధించాలని వరల్డ్ కప్ లో ఎంతో కసితో ఆడి చోటు సంపాదించుకున్న దినేష్ కార్తీక్ కు నిరాశ ఎదురయింది అని చెప్పాలి. దక్షిణ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తీక్ గాయం బారిన పడ్డాడు. 15వ ఓవర్ తర్వాత వెన్ను నొప్పి రావడంతో ఇక మోకాళ్లపై కూర్చున్నాడు. వెంటనే ఫిజియో వచ్చి అతన్ని తీసుకువెళ్లాడు. అయితే కార్తీక్ స్థానంలో ఇక రిషబ్ పంత్ కీపింగ్ చేయడానికి వచ్చాడు అని చెప్పాలి. ఇక దినేష్ కార్తీక్ కి గాయం కావడంతో రిషబ్ పంత్ తర్వాత మ్యాచ్లో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే దినేష్ కార్తీక్ నెక్స్ట్ మ్యాచ్లో ఉంటాడా లేదా అన్నదానిపై మాత్రం అటు బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: