చాలు చాలు.. ఇక అతన్ని పక్కన పెట్టండి?
ఐపీఎల్ లో అదిరిపోయే ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి. ఈ క్రమంలోనే ఇక టీమిండియాలోకి వచ్చి తర్వాత కూడా అదే రీతిలో ప్రదర్శన చేసి టీమిండియాలో ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న ఫినిషర్ పాత్రకు తానే సరైన ఆటగాడిని అని తన ఆట తీరుతోనే నిరూపించాడు అని చెప్పాలి. అయితే ఇక భారత క్రికెట్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ 37 ఏళ్ల దినేష్ కార్తీక్ ని అటు టి20 వరల్డ్ కప్ లో ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఇక అతను ఫినిషిర్ పాత్ర పోషిస్తాడని భావించారు. కానీ ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో అతనికి పెద్దగా అవకాశం రాలేదు. అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో మంచి ఛాన్స్ కొట్టేశాడు దినేష్ కార్తీక్. దీంతో తనని తాను నిరూపించుకునే ఛాన్స్ వచ్చిందని ఎంతోమంది భావించారు.
కానీ సిక్సార్లు ఫోర్ లతో చెలరేగిపోవాల్సిన దినేష్ కార్తీక్ సింగిల్స్ కి సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయాడు. 15 బంతులు ఆడి 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో అతనిపై విమర్శలు వస్తున్నాయి. అతను క్రీజు లో కుదురుకునేందుకు సమయం తీసుకున్నప్పటికీ సరైన టైంలో గేరు మార్చలేకపోయాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఏకంగా టి20 లలో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడని ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు. అయితే అతడి స్థానంలో వెంటనే రిషబ్ పంత్ ను తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం.