రాహుల్ భయ్యా.. ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కాదు.. మర్చిపోయావా?

praveen
వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై విజయం సాధించిన టీమిండియా రెండవ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై భారీ తేడాతో విజయం సాధించి మంచి రన్ రేట్ కూడా సాధించింది. అయితే ఇటీవల టీం ఇండియాకు అసలు సిసలైన సమవుజ్జి అయిన సౌతాఫ్రికా తో టీమ్ ఇండియా ఎలా రాణిస్తుందో అని అనుకున్నప్పటికీ ఇక కీలకమైన పోరులో పోరాడి ఓడింది  టీమిండియా. ఇక టీమిండియా మిగతా మ్యాచ్లలో విజయం సాధించే అవకాశాలు ఉండడంతో టీమిండియా ఫ్యాన్స్ పెద్దగా నిరాశ పడటం లేదు.


 అయితే టీమిండియా అభిమానులు అందరూ ప్రస్తుతం ఆందోళన చెందుతుంది మాత్రం అటు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గురించి అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా మూడు మ్యాచ్లు ఆడింది. అయితే మూడు మ్యాచ్లలో భాగంగా భారీ అంచనాల మధ్య ఓపెనర్ గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ చేసింది. కేవలం 4,9,9 పరుగులు మాత్రమే. దీని బట్టి అతను ఎంత పేలవ ప్రదర్శన చేస్తున్నాడు అన్నది అర్థమవుతుంది. ఇప్పటికే పేలవ  ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్ తనని తాను నిరూపించుకోవడంలో విఫలమవుతున్నాడు అని చెప్పాలి.


 అయితే ఇప్పుడు వరకు ఆడిన మూడు మ్యాచ్లలో కూడా ఒకవైపు పాకిస్తాన్ మరోవైపు దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంతో బలంగా ఉందని భావించిన.. ఇక మధ్యలో జరిగిన నెదర్లాండ్స్ పైన మ్యాచ్లో కూడా కేఎల్ రాహుల్ తేలిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే కే.ఎల్ రాహుల్ లో కాన్ఫిడెన్స్ కనిపించడం లేదని ఎన్నో విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు కేఎల్ రాహుల్ ఇది కేవలం ప్రాక్టీస్ మ్యాచ్ కాదు.. వరల్డ్ కప్ లో అధికారిక మ్యాచ్.. ఆ విషయం నీకు గుర్తు లేనట్టుంది అందుకే ఇలా ఆడుతున్నావ్ అంటూ మరి కొంతమంది అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: