పంత్ పాక్ జట్టులో ఉంటే.. అలా చేసేవారా?

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఘోర వైఫల్యం చెందడం పై ఆదేశం మాజీ ఆటగాళ్ళు ఎంతటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  జట్టు కూర్పు దగ్గర నుంచి అటు కెప్టెన్సీ వరకు ఏది బాగాలేదు అంటూ ఇక మాజీ ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టును ఏకీపారేస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోజురోజుకు పాకిస్తాన్ కు సెమీఫైనల్ లో అడుగుపెట్టే అవకాశాలు పూర్తిగా కనుమరుగవుతున్న నేపథ్యంలో ఇక పాకిస్తాన్ పై వస్తున్న విమర్శలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గడం లేదు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టు వైఫల్యంపై ఆ దేశ మాజీ ఆటగాడు వహాబ్ రియాజ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత్ పాకిస్తాన్ ఆటతీరు పట్ల, జట్టు ఎంపిక పట్ల ఎంతో వ్యత్యాసం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. పంత్ లాంటి చురుకైన ఆటగాడిని సైతం జట్టు నుంచి పక్కనపెట్టి కేవలం దినేష్ కార్తీక్ కూ మాత్రమే అవకాశం ఇవ్వడాన్ని కొనియాడాడు వహాబ్ రియాజ్. అదే స్థానంలో పాకిస్తాన్ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇంతటి తెగువ చూపదని వ్యాఖ్యానించాడు. ఇప్పటికైనా భారత్ ను చూసి నేర్చుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు వహాబ్ రియాజ్.


 ఎంఎస్ ధోని తర్వాత రిషబ్ పంత్ ఆ స్థాయి వికెట్ కీపర్.. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్లో సెంచరీలతో విరుచుకుపడ్డాడు. అలాంటి ఆటగాడిని దినేష్ కార్తీక్ కోసం సెలెక్టర్లు పక్కన పెట్టారు. పంత్ సామర్థ్యం ఎలాంటిదో అందరికీ తెలుసు. అతను పరుగులు చేయగలడు అని కూడా తెలుసు. కానీ ఫినిషింగ్ లో తడబడితే నష్టం టీమిండియాకే. అందుకే సరైన ఫినిషింగ్ కావాలని కాబట్టి దినేష్ కార్తీక్ ని ఎంపిక చేసుకున్నారు. ఒకవేళ పంత్ పాకిస్తాన్ జట్టులో ఉండి ఉంటే జట్టు అవసరాల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకునేవారు కాదు అంటూ విమర్శలు గుప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: