బుమ్రా ఇక అలా ఆడటం కష్టమే : జెఫ్ థామ్సన్

praveen
భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న  బుమ్రా గాయం కారణంగా వరల్డ్ కప్ మొత్తానికి కూడా దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే  వరల్డ్ కప్ ముందు వెన్నునొప్పి గాయం బారిన పడిన బుమ్రా ఇక నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొంది మళ్లీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చాడు. కానీ దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ లో భాగంగా జట్టులో చేరిన బుమ్రా  మల్లి గాయం తిరగబెట్టడంతో ఇక వరల్డ్ కప్ మొత్తానికి కూడా దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టు లోకి రి ఎంట్రీ ఇచ్చే బుమ్రా ఎలాంటి ప్రదర్శన చేస్తాడు.. అసలు మూడు ఫార్మాట్లలో కొనసాగుతాడా లేదా అనే ఆందోళన కూడా అభిమానుల్లో ఉంది.

 ఇక ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ జఫ్ థామ్సన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా మూడు ఫార్మాట్లలో నిర్విరామంగా ఆడి అతని శరీరంపై శ్రమ పెట్టాడు. అందుకే గాయాల బారిన పడ్డాడు.. దీంతో బుమ్రా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడో నిర్ణయించుకునే అవకాశం ఉంది. కెరియర్ లో ఒక దశాబ్దం పాటు మాత్రమే అత్యుత్తమ స్థాయిలో బౌలింగ్ చేయగలడు. ఆ తర్వాత కెరియర్ని సుదీర్ఘ కాలం కొనసాగించాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయంపై ఆలోచించాలి.


 ఇక ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో ఉన్నా బుమ్రా కేవలం వైట్ బాల్ క్రికెట్ ను మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం.. క్రికెట్ అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటున్నారు.. అతడు ఏం చేయాలో ఆలోచించడం ఎంతో ముఖ్యం. ఇక వైట్ బాల్ క్రికెట్లో టీమిండియా తరఫున బుమ్రా ఆడి ప్రపంచకప్ లు అందించాలని అభిమానులు కోరుకుంటే.. ఇక బుమ్రా కూడా అదే ఎందుకు ఎంచుకోకూడదు.. ఇలా తరచూ గాయాల బారిన పడితే ఇక మూడు ఫార్మాట్లో బుమ్రా ఆడటం చాలా కష్టం. అయితే ఇదంతా అతని వ్యక్తిగతం. అతని హృదయానికి ఏం చేయాలనిపిస్తే అలాంటి నిర్ణయం తీసుకుంటాడు అంటూ జఫ్ థామ్సన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: