పరుగు కోసం ఇలాంటి పనా.. పాక్ ఆటగాడిపై విమర్శలు?
ఇక ఇటీవల టి20 ప్రపంచ కప్ లో కూడా ఇలాంటి చాలానే వెలుగులోకి వచ్చే అని చెప్పాలి.. అయితే ఇటీవల పాకిస్తాన్ జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది అన్నది తెలుస్తుంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై జింబాబ్వే ఒక పరుగు తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. వరుసగా రెండు ఓటములతో సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది పాకిస్తాన్. ఇకపోతే పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో మహమ్మద్ వసీం చేసిన తప్పిదం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా పరుగు చేయాలని ఆత్రుతతో రూల్స్ ని అతిక్రమించాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హగ్ స్పందించాడు. బాల్ డెలివరీ అవ్వకముందే బ్యాట్స్మెన్ క్రీజు దాటడం పై కఠిన నిబంధనలు తీసుకురావడానికి కారణం ఇదే.. అతను ఎంతలా ముందుకు వెళ్ళాడో చూడండి అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ఈ విషయంపై క్రికెట్ అనలిస్ట్ పీటర్ డెల్ పెన్నా స్పందించాడు. బంతి డెలివరీకి ముందు బౌలర్ గాల్లోకి ఎగరానికి ముందే వసీం క్రీజు దాటేసాడు. డెలివరీ సమయానికి చాలా ముందుకు వెళ్లిపోయాడు. ఒకసారి ఊహించండి. దీనివల్ల పాకిస్తాన్ జట్టు రెండో పరుగు కూడా పూర్తి చేసి ఉంటే అతని అవుట్ చేసే అవకాశం కూడా పోయి సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చేది అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో తెలిపాడు. ఇక ఈ పోస్టులు కాస్త వైరల్ గా మారిపోయాయి.