డ్రైవర్ గా పని చేశాడు.. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ లో?

praveen
సాధారణంగా ఒక్కసారి ప్లేయర్లు ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత వారి జీవనశైలి మొత్తం మారిపోతుంది అని అంటూ ఉంటారు. కోట్ల రూపాయలు సంపాదించి లగ్జరీ లైఫ్ ని గడిపేస్తూ ఉంటారు అని ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు ఊహించుకుంటూ ఉంటారు.  కానీ ఇలా ప్రేక్షకులు చూసేది నాణేనికి ఒకవైపు మాత్రమే. కానీ మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నప్పటికీ మంచి ప్రదర్శన చేసినప్పటికీ ఇంకా బతుకు బండిని నడిపించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి క్రికెటర్లకు ఉంటుంది అన్నది మాత్రం కొంతమందిని చూస్తే అర్థమవుతూ ఉంటుంది.


 ముఖ్యంగా నెదర్లాండ్స్  లాంటి చిన్న క్రికెట్ బోర్డు వారి ఆటగాళ్లు ఎంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ ఆర్థిక పరిస్థితి దృశ్య వారికి పెద్దగా వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఉంటుంది అని చెప్పాలి. ఇక పోతే ఇటీవలే నెదర్లాండ్స్ జట్టు తరఫున మంచి ప్రదర్శన కనబరిచి దృష్టిని ఆకట్టుకున్నాడు పాల్వాల్ మేకరన్. క్రికెట్ జీవితంగా అతను జీవనం సాగిస్తున్నాడు. అతను ఆడితేనే డబ్బులు.  అవి వస్తేనే కుటుంబం పోషణ సాధ్యమవుతుంది. మూడు పూటలా తినడానికి తిండి ఉంటుంది. 2013లో నెదర్లాండ్స్ తరఫున అరంగేట్రం చేసిన అతను మేటి క్రికెటర్ గా గుర్తింపు పొందాలని ఎంతగానో కలగన్నాడు.


కాగా సాఫీగా  సాగిపోతున్న అతని కెరియర్ కు కరోనా బ్రేకులు వేసింది. క్రికెట్ వాయిదా పడడంతో జీవితం అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రొఫెషనల్ క్రికెటర్ గా ఉన్న అతను క్రికెట్ ను దూరం పెట్టి కుటుంబ పోషణ కోసం వేరే ఉద్యోగం చూసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోణే ఉబర్ ఇట్స్ లో ఆహారాన్ని డెలివరీ చేసే డ్రైవర్ గా కూడా పనిచేశాడు.  కరోనా తగ్గి మళ్ళీ క్రీడలు యధావిధిగా జరగడం మొదలు కావడంతో కౌంటీల బాట పట్టిన అతను తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గత ఏడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొని ఈ ఘనత సాధించిన తొలి డచ్ క్రికెటర్ గా నిలిచాడు. టి20 ప్రపంచ కప్ లో క్వాలిఫైయర్ మ్యాచ్లో కూడా బాగా రానించి జట్టు సూపర్ 12 చేరడంలో కీలకపాత్ర వహించాడు. ఇటీవల భారత్తో జరిగిన మ్యాచ్లో బాగా రాణించి  ఏకంగా కేఎల్ రాహుల్ వికెట్ పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: