కోహ్లీ ప్లేస్ లో బాబర్ ఉండి ఉంటేనా.. పాక్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
ఈనెల 23వ తేదీన క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూసిన దయాధుల సమరం ఎంత కిక్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది అని చెప్పాలి.  ఇక ఈ మ్యాచ్ లో భాగంగా విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ గురించి అయితే ప్రేక్షకులు అస్సలు మర్చిపోవడం లేదు. ఇకపోతే ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్న ఇక ఈ రెండు జట్లకు సంబంధించిన ఇన్నింగ్స్ గురించి అయితే ఇంకా చర్చ జరుగుతూనే ఉంది అని చెప్పాలి.

 ముఖ్యంగా కష్ట సమయంలో తీవ్రమైన ఒత్తిడిని తట్టుకుని విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తీరు అమోఘం అంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో 53 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల  సహాయంతో 82 పరుగులు చేసి అజయంగా నిలిచాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ ప్లేస్ లో ఎవ్వరు ఉన్న గెలిపించేవారు కాదు. నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లీ ప్లేస్ లో బాబర్ అజాం కానీ మహమ్మద్ రిజ్వాన్ కానీ ఉండి ఉంటే పాకిస్తాన్ కచ్చితంగా 40 పరుగులు తేడాతో ఓడిపోయి ఉండేది అంటూ పాకిస్తాన్ మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మాల్ వ్యాఖ్యానించాడు.


 ఎందుకంటే పాకిస్తాన్ ప్లేయర్లకు ప్రెషర్ హ్యాండిల్ చేయడం తెలియదని చెప్పుకొచ్చాడు.. ఇక పాకిస్తాన్లో అండర్ 15, అండర్ 19 ఆడుతున్న కుర్రాళ్ళు అందరికీ కూడా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను చూపించాలి అంటూ కమ్రాన్ అక్మల్  వ్యాఖ్యానించాడు.  విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ని చూపిస్తే ఒక ఇన్నింగ్స్ ని ఎలా నిర్మించాలి మ్యాచ్ను ఎలా గెలిపించాలని పాఠాన్ని నేర్చుకుంటారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే బాబర్ అజాం మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మాల్, ఉమర్ అక్మాల్ మేనల్లుడు కావడం గమనార్హం. ఇక ఇలా అక్మాల్ బ్రదర్స్ తోడ్పాటుతోనే బాబర్ అజాం క్రికెటర్గా ఎదిగి ఇక ఇప్పుడు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: