బీసీసీఐ సంచలన నిర్ణయం... పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు !

VAMSI
" data-original-embed="" >

భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలోనే పురుషులు , మహిళలు మరియు అంధుల కు సంబంధించిన క్రికెట్ షెడ్యూల్స్ అన్నీ చూసుకుంటూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ జట్లలో ఉన్న ఆటగాళ్లకు సంబంధించి మ్యాచ్ ఫీజులు వారి కాంట్రాక్టులు అన్నీ కూడా వీరి పరిధి లోనే జరుగుతాయి. ఇప్పటి వరకు చూసుకుంటే బీసీసీఐ మ్యాచ్ లకు గాను చెల్లించే ఫీజులలో  మహిళలు మరియు పురుషులకు వ్యత్యాసం ఉండేది. దీనితో మహిళా క్రికెటర్లు చాలా సందర్భాలలో ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకు వెళ్లారు. ఎందుకంటే పురుషుల స్థాయిలో పురుషులు మరియు మహిళల స్థాయిలో మహిళలు శక్తి మేర రాణిస్తూ ఉంటారు.

ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పడానికి వీలు లేదు. పైగా మహిళల ఇండియా టీం సైతం ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ అన్ని జట్ల పైన ఉత్తమ ప్రదర్శనను కనబరుస్తూ ఉంది. రీసెంట్ గా జరిగిన మహిళల ఆసియా కప్ టోర్నీలోనూ తిరుగులేని విధంగా ఆడి ఇండియాకు ఏడవసారి కప్ ను అందించింది హర్మన్ నేతృత్వంలోని జట్టు. ఇదిలా ఉంటే బీసీసీఐ ఇప్పుడు సరికొత్తగా సంచలన నిర్ణయాన్ని తీసుకుని మహిళా క్రికెటర్లకు శుభవార్తను అందించింది. పురుషులు ప్రస్తుతం బీసీసీఐ నుండి అందుకుంటున్న మ్యాచ్ ఫీజు వివరాలు చూస్తే, ఒక టెస్ట్ కు - 15 లక్షలు , ఒక వన్ డే కు - 6 లక్షలు మరియు టీ 20 కి అయితే 3 లక్షలు గా ఉన్నాయి.

ఇప్పడు పైన చెప్పుకున్న విధంగానే మహిళా క్రికెటర్లకు కూడా మ్యాచ్ ఫీజులు అందేలా బీసీసీఐ ఈక్విటీ పాలసీ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ ద్వారా తెలియచేశారు. ఈ ఈక్విటీ పాలసీ విధానం మహిళా క్రికెటర్లకు ఎంతో అన్నదాన్ని ఇస్తుందని చెప్పగలము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: