ఐర్లాండ్ విజయం.. మైఖేల్ వాన్ ను ట్రోల్ చేసిన వసీం జాఫర్?
వర్షం ఆటపై ప్రభావం చూపడంతో ఇక డక్ వర్త్ లూయిస్ రూల్ ప్రకారం విజేతను నిర్ణయించారు. దీంతో ఇక ఐర్లాండ్తో పోల్చి చూస్తే ఇంగ్లాండ్ అయిదు పరుగులు వెనకే ఉండడంతో ఇక ఐర్లాండ్ ను విజేతగా ప్రకటిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. అయితే తాజాగా ఇదే విషయంపై భారత మాజీ బ్యాట్స్మెన్ వసీం జాఫర్ కూడా స్పందించాడు. ఇక మరోసారి సోషల్ మీడియా వేదికగా మైకల్ వాన్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టాడు.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ల మధ్య ఎప్పుడు సోషల్ మీడియాలో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది.. ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ వీరిద్దరూ కూడా ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐర్లాండ్ విజయం తర్వాత వసీం జాఫర్ ఒక కామెడీ వీడియోని షేర్ చేస్తూ ఈ వీడియోకి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకల్ వాన్ ను ట్యాగ్ చేశాడు. డక్ వర్త్ లూయిస్ ఎలా ఐర్లాండ్ కు మేలు చేసింది అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా ఫన్నీగా తెలిపాడు వసీం జాఫర్. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.