ధోని వల్లే కార్తీక్ కెరియర్ నాశనం.. డీకే తండ్రి ఏమన్నాడంటే?
ఇలా ఎంతోమంది యువ ఆటకాళ్లకు లైఫ్ ఇచ్చిన ధోని ఒక ఆటగాడు కెరియర్ నాశనం కావడానికి కారణమయ్యాడు అనే వార్తలు మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఆ ఆటగాడు ఎవరో కాదు దినేష్ కార్తీక్. అప్పట్లో క్రికెట్ కీపర్ గా బ్యాట్స్మెన్ గా దినేష్ కార్తీక్ జట్టులో ఉండేవాడు. కానీ ధోని జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడో లేదో ఇక ధోని ప్రతిభ ముందు దినేష్ కార్తీక్ తేలిపోయాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా అవకాశం కల్పించిన ప్రూవ్ చేసుకోలేకపోయాడు. దీంతో జట్టుకు పూర్తిగా దూరమైపోయాడు అని చెప్పాలి.
ధోని కారణంగానే దినేష్ కార్తీక్ కెరియర్ నాశనం అయిందంటూ కొంతమంది డీకే అభిమానులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటూ ఉంటారు. ఇదే విషయంపై దినేష్ కార్తీక్ తండ్రి కృష్ణ కుమార్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని రావడం వల్ల తన కుమారుడు దినేష్ కార్తీక్ జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చిందని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు డీకే కోసం ఇంకేదో రాసి పెట్టాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇంకా కష్టపడాలని దేవుడు కోరుకున్నాడు. ఇక ఇప్పటివరకు డీకే ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదు అంటూ కృష్ణకుమార్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం దినేష్ కార్తీక్ వరల్డ్ కప్ జట్టులో ఉన్నాడు.