ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్.. మళ్లీ జరగాలంటే?

praveen
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు అటు ప్రేక్షకుల్లో ఎంతలా ఉత్కంఠ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్ పాకిస్తాన్ కు సంబంధించిన క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు క్రికెట్ ప్రపంచం మొత్తం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను కన్నారపకుండా వీక్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ దాయాదుల పోరు ఎప్పుడు జరుగుతుందో అని వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటుంది అని చెప్పాలి.  ఇకపోతే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక అందరూ ఊహించినట్లుగానే దాయాదుల పోరు పైసా వసూల్ మ్యాచ్ గా జరిగింది అని చెప్పాలి.



 చివరి బంతి వరకు కూడా విజయం ఎటువైపు వెళుతుందో కూడా తెలియని విధంగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో చివరికి భారత జట్టు 4 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై విజయడంకా మోగించింది. ఇక వరల్డ్ కప్ లో బోనీ కొట్టింది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో ఉన్న ఉత్కంఠను చూసి అభిమానులు మాత్రమే కాదు కామెంటెటర్లు మిగతా జట్ల ఆటగాళ్లు సైతం మైమరిచిపోయారు.  అయితే మరోసారి ఈ దాయాదుల పోరు జరిగితే చూడాలని ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఆశపడుతున్నారు అని చెప్పాలి.


 అయితే వరల్డ్ కప్ లో భాగంగా మరోసారి భారత్,పాకిస్తాన్ మ్యాచ్ జరగాలంటే మాత్రం అది కేవలం ఫైనల్లో మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పాలి. ప్రస్తుతం గ్రూపు బి లో ఉన్న టీం ఇండియా పాకిస్తాన్ జట్లు సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ ను ఓడించి సెమీఫైనల్ లిస్టులో టాప్ టూ లో ఉండాలి. ఇక ఆ తర్వాత గ్రూప్ ఎ లో సెమి ఫైనల్లో టాప్ 2 లోకి వచ్చిన జట్లను ఓడిస్తే.. ఇక ఇండియా పాకిస్తాన్ జట్లు ఫైనల్ లో అడుగుపెడతాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ రెండు జట్లు కూడా ఫైనల్ లో పోటీ పడాలని ఆశ పడుతున్నారు అభిమానులు  ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: