టీమిండియా ప్రపంచ రికార్డ్.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టేసింది?

praveen
గత కొంతకాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లను గెలుచుకుంటూ దూసుకుపోయింది టీమిండియా. ఇక మెగా టోర్నీలలో కూడా ఇలాంటి ప్రదర్శన చేస్తూ అదరగొడుతుంది అని చెప్పాలి. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఈనెల 23వ తేదీన మొదటి మ్యాచ్ ఆడింది టీమిండియా.


 ఈ మ్యాచ్ లో భాగంగా టీమ్ ఇండియా చేసిన ప్రదర్శన పై అటు క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడిన వీరోచితమైన ఇన్నింగ్స్ అటు ప్రపంచం క్రికెట్ పరీక్షకులందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇలా పాకిస్తాన్పై విజయం సాధించిన టీమిండియా అరుదైన రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి   ఒక క్యాలెండర్ ఇయర్ లో అన్ని ఫార్మట్ లలో కలిపి అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది.


 అయితే గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది అని చెప్పాలి  2003 క్యాలెండర్ ఇయర్ లో ఆస్ట్రేలియా అన్ని ఫార్మట్ లలో కలిపి 47 మ్యాచ్లు ఆడితే 38 విజయాలు సాధించింది. అప్పుడు ఆస్ట్రేలియా కు రిఖీ పాంటింగ్ కెప్టెన్ గా ఉన్నాడు ఇందులో 30 వన్డేలు ఎనిమిది టెస్టులు ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది  క్యాలెండర్ ఇయర్ లో భారత్ ఇంకా పది మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా ఇప్పటికే 56 మ్యాచులలో 39 విజయాలు సాధించింది. ఇందులో 24 టీ20 లు, రెండు టెస్టులు, 13 వన్డేలు ఉండడం గమనర్హం. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ అరుదైన రికార్డును సృష్టించింది టీం ఇండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: