కోహ్లీ ఎప్పుడు ఏడ్వలేదు.. కానీ తొలిసారి అలా చూసా?
కఠినమైన పరిస్థితుల్లో చివరి వరకు క్రీజులో నిలబడి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించడమే కాదు ఇక చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పై ఎప్పుడు మరిచిపోలేని విధంగా విజయాన్ని అందించాడు విరాట్ కోహ్లీ. మరోవైపు నుంచి హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ తో తనదైన తోడ్పాటు అందించడంతో ఇక విరాట్ కోహ్లీ విరోచిత పోరాటం చేసి జట్టును గెలిపించాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయ్యి ఏకంగా కంటనీరు పెట్టుకున్నాడు. ఇదే విషయంపై కామెంటేటర్ హర్ష భోగ్లే స్పందించాడు. నేను విరాట్ కోహ్లీని ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఎన్నో కఠిన సవాళ్లను విరాట్ కోహ్లీ ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పటివరకు ఎప్పుడూ కూడా అతను కంటతడి పెట్టడం చూడలేదు.
కానీ నా జీవితంలో తొలిసారి విరాట్ కెరియర్ లో మొదటిసారి ఇక పాకిస్తాన్ పై విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ కంటతడి పెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయాను అంటూ హర్ష బోగ్లే చెప్పుకొచ్చాడు. ఇది ఎప్పటికీ మరువలేని సంఘటన అంటూ తెలిపాడు. అంటే ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఎంత విలువైనదో ఆ కన్నీళ్లను బట్టి అర్థం చేసుకోవచ్చు అంటూ హర్ష భోగ్లె పరోక్షంగా వ్యాఖ్యానించాడు అని చెప్పాలి. కాగా తన బ్యాట్ నుంచి ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఎలా వచ్చిందో తనకు కూడా అర్థం కావడం లేదు అని విరాట్ కోహ్లీ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అన్న విషయం తెలిసిందే.