హార్దిక్ అరుదైన రికార్డ్.. తొలి ఇండియన్ క్రికెటర్?
ఇలా భారత క్రికెట్లో టీమిండియా కు దొరికిన ఒక ఆణిముత్యం లాంటి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక అతను ఆడుతున్నంతసేపు ప్రేక్షకులు అందరూ కూడా కనురెప్ప వాల్చకుండా అతని ఆటను వీక్షిస్తూ మైమర్చిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికే తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన హార్దిక్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు అని చెప్పాలి. ఏకంగా బౌలింగ్లో రెండు వికెట్లు తీయడమే కాదు బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. అంతర్జాతీయ టి20లో 1000 పరుగులు పూర్తి చేసుకోవడమే కాదు ఇక 50 వికెట్లు సాధించిన తొలి భారతీ క్రికెటర్ గా నిలిచాడు. అంతేకాకుండా ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా అరుదైన లిస్టులో చేరిపోయాడు హార్దిక్ పాండ్యా. గతంలో బ్రావో, షాహిద్ ఆఫ్రిది, మహమ్మద్ హఫీస్, షాకిబూల్ హసన్, కెవిన్ ఓబ్రేయిన్, మహమ్మద్ నబీ ఈ ఘనత సాధించిన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఇటీవల పాకిస్తాన్ తో మ్యాచ్లో తీవ్రమైన ఒత్తిడి ఉన్న సమయంలో హార్దిక్ పాండ్యా జట్టు కోసం నిలకడగా ఆడిన తీరు అమోఘం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.