కళ్ళు చెదిరే క్యాచ్.. చేప పిల్లలా గాల్లోకి ఎగిరాడు?
ఇక ఈ వరల్డ్ కప్ లో ప్రేక్షకుల ఊహించిన దానికంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పక్క అని ప్రతి మ్యాచ్ చూస్తూ ఉంటే తెలుస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికే ఎంతోమంది ప్లేయర్లు అద్భుతమైన క్యాచ్ లతో అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇక ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 12 మ్యాచ్ లలో భాగంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్ ప్లేయర్లు గ్లెన్ ఫిలిప్స్ సూపర్ ఫీల్డింగ్ తో అదరగొట్టాడు. దీంతో వార్తలు అతనే హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి.
అసాధారణమైన రీతిలో క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. గ్లెన్ ఫిలిప్స్ అచ్చం చేప పిల్లల్లాగానే మైదానంలో డైవ్ చేసిన తీరు సహచర ఆటగాళ్లతో పాటు టీవీ ముందు ఉన్న ప్రేక్షకులను సైతం ఒక్కసారి ఇక ఇతను సూపర్ మ్యాన్ లాగా గాల్లోకి ఎగిరి ఫీల్డింగ్ చేయడంతో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మెన్ స్టోయినిస్ ఏడు పరుగులు చేసి చివరికి వికెట్ కోల్పోయి పెవిలియన్ చేరాడు అని చెప్పాలి. ఈ అద్భుతమైన క్యాచ్ కూ సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 9 ఓవర్ లో ఈ ఘటన జరిగింది అని చెప్పాలి.