13 ఏళ్ళ తర్వాత ఆస్ట్రేలియా పై గెలిచిన కివీస్ !
అయితే ఒక చక్కని బంతితో హాజిల్ వుడ్ ఫిన్ ను బౌల్డ్ చేశాడు. ఇక మరో ఓపెనర్ కాన్ వే సైతం ఆ తర్వాత రెచ్చిపోయాడు. ఆ తర్వాత కెప్టెన్ విలియమ్సన్ రన్ ఏ బాల్ ఆటకు జంపా ఫుల్ స్టాప్ పెట్టాడు. కివీస్ నిర్ణీత ఓవర్ లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఇందులో కాన్ వే 92 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. కాగా చివర్లో 200 పరుగులు రీచ్ అవ్వడానికి నీషం లిటిల్ క్యామియో నే కారణం. 201 పరుగుల లక్ష్యంతో ఛేదన ఆరంభించిన ఆస్ట్రేలియా ఏ దశలోనూ విజయాన్ని సాధించేలా కనిపించలేదు. వరుసగా వికెట్లు కోల్పోయి కేవలం 111 పరుగులకే కుప్పకూలిపోయింది.
కివీస్ బౌలర్లు అందరూ కూడా విశేషంగా రాణించి వరల్డ్ కప్ లో మొదటి విజయాన్ని అందుకున్నారు. సౌథీ మరియు మిచెల్ లు తలో మూడు వికెట్లు తీయగా, బౌల్ట్ రెండు , ఫెర్గుసన్ మరియు సోది లు ఒక్కో వికెట్ తీశారు. ఈ విజయంతో 13 ఏళ్లుగా వైట్ బాల్ క్రికెట్ లో ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా విజయం ఎరుగని కివీస్ కు విజయం దక్కింది. అంతే కాకుండా గతంలో వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ మరియు టీ ౨౦ వరల్డ్ కప్ ఫైనల్ లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకున్నట్లు కాకపోయినా , ఇది ఒక ఓదార్పు విజయం అని చెప్పాలి.
అయితే మ్యాచ్ ఆద్యంతం కివీస్ ఆధిపత్యమే సాగింది.