చిన్నారి ప్రశ్న.. షాకైన ధోని.. ఏం ఆన్సర్ ఇచ్చాడంటే?

praveen
మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు వింటే చాలు అటు క్రికెట్ అభిమానులు అందరిలో కూడా పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అతని ఆట తీరు ఆ రేంజ్ లో ఉంటుంది. ఎంతో ఒత్తిడితో కూడిన మ్యాచ్ ను కూడా తన వ్యూహాలతో తన వైపుకు తిప్పుకోవడంలో మహేంద్రసింగ్ ధోని దిట్టా అని చెప్పాలి. ఒత్తిడిలో క్రికెటర్లు ఎంతో కోపంగా కనిపిస్తూ ఉంటారు. కానీ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని మాత్రం నరాల తెగ ఉత్కంఠ మధ్య కూడా చిరునవ్వుతోనే ప్రత్యర్థులకు షాక్ ఇస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక భారత జట్టుకు కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని సాధించిన విజయాలు  ఇప్పుడు వరకు ఎవరికీ సాధ్యం కాలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ఇలా మహేంద్ర సింగ్ ధోని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక భారత క్రికెట్ లో ఒక లెజెండరీ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ  ప్రేక్షకులందరికీ కూడా అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే కేవలం ఐపిఎల్ లో మాత్రమే మెరిసే మహేంద్ర సింగ్ ధోని.. అటు సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా యాక్టివ్గా ఉంటాడు. ఎప్పుడో ఓసారి మాత్రం పోస్టులు పెడుతూ ఉంటాడు. అయినప్పటికీ ధోనీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.



 మహేంద్ర సింగ్ ధోని ఇటీవలే తన పేరు మీద ఉన్న గ్లోబల్ స్కూల్ కి వెళ్లారు. ఈ క్రమంలోనే తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నాడు మహేంద్రడు. చెన్నై సూపర్ కింగ్స్ ధోని కి సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారత మాజీ కెప్టెన్ పాఠశాల పిల్లలతో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న ధోని షాక్ కి గురి చేసింది. స్కూల్లో చదువుతున్నప్పుడు ఈ స్టార్ క్రికెటర్ కి ఏ సబ్జెక్టు బాగా నచ్చిందంటూ ఓ చిన్న అమ్మాయి ధోని అడిగింది. అయితే ఈ ప్రశ్న విన్న ధోని వెంటనే నవ్వుకున్నారు. క్రీడలను తాను సబ్జెక్టుగా పిలుస్తాను అంటూ తనకు క్రికెట్ మాత్రమే నచ్చింది అని ఆసక్తికర సమాధానం చెప్పాడు ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: