శ్రీలంక క్రికెట్ టీం పరువు నిలుపుకుంది.. లేదంటేనా ?
కాగా శ్రీలంక ఇంకా మెయిన్ లోకి అర్హత సాధించకపోవడంతో ముందుగా క్వాలిఫైయర్స్ ఆడాల్సి వచ్చింది. అందులో భాగంగా ఆడిన మొదటి మ్యాచ్ లోనే నమీబియా చేతిలో ఓడిపోయి అందరినీ నిరాశపరిచింది. ఇక ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచి సూపర్ 12 లోకి ప్రవేశించింది. అయితే నెదర్లాండ్ ఈ రోజు జరిగిన మ్యాచ్ లో గెలిచేంత పని చేసింది.. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 162 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ 79 పరుగులతో మెరిశాడు. లష్య ఛేదనలో నెదర్లాండ్ వరుస వికెట్లను కోల్పోతూ వచ్చింది. కానీ ఓపెనర్ మాక్స్ ఓడోడ్ మాత్రం ఆఖరి వరకు పోరాడినా ఫలితం మాత్రం దక్కలేదు.
ఈ ప్రయత్నంలో మాక్స్ చేసిన 71 పరుగులు వృధా అయ్యాయి. ఒకవేళ ఈ మ్యాచ్ లో నెదర్లాండ్ గెలిచి ఉంటే శ్రీలంక కు సూపర్ 12 కు వెళ్లే ఛాన్స్ ఉండకపోయేది మరియు పరువు మొత్తం గంగలో కలిసి ఉండేది. కానీ కీలక మ్యాచ్ లో లంక బౌలర్లు రాణించి నెదర్లాండ్ పై 16 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. శ్రీలంక స్పిన్నర్లు హాసరంగా 3 వికెట్లు మరియు తీక్షణ 2 వికెట్లు తీసి నెదర్లాండ్ ను అడ్డుకోవడంలో పూర్తిగా సఫలం అయ్యారు.