మన్కడింగ్ : ఆ అవసరం ఏముంది.. రవి శాస్త్రి షాకింగ్ కామెంట్స్?
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత బౌలర్ దీప్తి శర్మ కూడా ఇలాంటి మన్కడింగ్ చేసి వార్తల్లో నిలిచింది. ఐసీసీ రూల్ ప్రకారం మన్కడింగ్ ద్వారా రనౌట్ చేసినప్పటికీ.. ఇక క్రీడా స్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారు అంటూ ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు ఆయా క్రికెటర్ల పై విమర్శలు చేస్తూ ఉండడం కూడా ఇటీవల కాలంలో చూశాము. ఇకపోతే ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉండడం గమనార్హం. కాగా టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి సైతం ఈ విషయంపై స్పందించాడు.
బౌలర్ బంతిని వెయ్యక ముందే నాన్ స్ట్రైకర్ క్రీజు వదిలి బయటకు రావాల్సిన అవసరం లేదని రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు. ఒకవేళ బ్యాటర్ అలా క్రీజు వదిలి బయటకు వెళ్తే అప్పుడు చేసే రన్ అవుట్ ను క్రీడా స్ఫూర్తిగా విరుద్ధమంటూ ప్రశ్నించడానికి కూడా అవకాశం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఫీల్డర్ కి కూడా ఇలాంటి కండిషన్ పెడతారా.. ఒకసారి క్యాచ్ వదిలేయ్.. మరోసారి పట్టుకో అని చెబుతారా అంటూ ప్రశ్నించాడు రవి శాస్త్రి. బంతి వేయకముందే బ్యాటర్ క్రీజు దాటి ముందుకు వెళ్తే పరుగు కోసం అడ్వాంటేజ్ తీసుకున్నట్లే అవుతుంది. ఇలా జరిగితే బ్యాటర్ ను ముందుగా హెచ్చరించాల్సిన అవసరంలేదు అంటూ చెప్పుకొచ్చాడు రవి శాస్త్రి.