కోహ్లీ లాంటి ఆటగాడిని.. మళ్లీ చూస్తానో లేదో : పాంటింగ్

praveen
ప్రస్తుతం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరిలాగానే ఒక సాదాసీదా ఆటగాడిగా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. కానీ తక్కువ సమయంలోనే తాను చరిత్రలో నిలిచిపోయే క్రికెటర్ ని అన్న విషయాన్ని తన ఆట తీరుతో నిరూపించాడు. భారత జట్టులోకి అరంగేట్రం చేసిన నాటి నుంచి రికార్డుల వేట ప్రారంభించిన విరాట్ కోహ్లీ ఇక ఎంతోమంది లెజెండరీ క్రికెటర్లు సాధించిన రికార్డులను సైతం ఎంతో అలవోకగా ఛేదించాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం రికార్డుల విషయంలో నేటితరం క్రికెటర్లలో ఎవరికి అందనంత దూరంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఎన్ని పరుగులు చేసిన ఇంకా దాహం తీరలేదు అన్న విధంగానే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరు ఉంటుంది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా మూడు ఫార్మాట్లలో కూడా అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగడం అటు కేవలం విరాట్ కోహ్లీ కే సాధ్యమైంది అని చెప్పాలి.  ఇక మొన్నటి వరకు ఫామ్ లేనిటో ఇబ్బంది పడిన కోహ్లీ ఇక ఇప్పుడు మరోసారి మునుపటి ఫామ్ అందుకుని వరల్డ్ కప్ లో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సోషల్ మీడియాలో ఫాలోవర్ల విషయంలో కూడా కోహ్లీ టాప్ లోనే ఉన్నాడు.


 ఇకపోతే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతిభ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్గా జట్టును ఎంతో అద్భుతంగా నడిపాడు అంటూ ప్రశంసించాడు. ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ గెలవడం ఒక చారిత్రాత్మక ఘట్టం. కోహ్లీ ఆట తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీ లాంటి ఆటగాడిని మళ్లీ చూస్తానో లేదో కూడా తెలియదు. వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీ రికార్డులు అద్భుతం అంటూ కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు పాంటింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: