వరల్డ్ కప్ లో.. హ్యాట్రిక్ సాధించింది వీళ్లే?
అలాంటిది క్రికెటర్లందరికీ కూడా ఒక కలలాంటి వరల్డ్ కప్ లో చోటు చోటు సంపాదించుకున్నారు అంటే చాలు ఇక తమలో ఉన్న అత్యుత్తమ ప్రతిభను బయటకు తీసేందుకు ప్రతి ఒక్క ఆటగాడు ప్రయత్నిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల టి20 వరల్డ్ కప్ లో కూడా ఒక ఆటగాడు ఇలా తనలో ఉన్న టాలెంట్ బయటపెట్టి అరుదైన రికార్డు సృష్టించి ఎంతో మంది స్టార్ బౌలర్ల సరసన చేరిపోయాడు. ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితమైన ఈ పోరులో తప్పక గెలవాల్సిన శ్రీలంక విజయం సాధించింది.
కాగా ఒక వైపు మ్యాచ్లో శ్రీలంక జట్టు విజయం సాధించినప్పటికీ అటు ప్రేక్షకుల అందరి మనసులు దోచుకుంది మాత్రం యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయ్యప్పన్ కావడం గమనార్హం. ఇక ప్రస్తుతం అతని అద్భుతమైన బౌలింగ్ ప్రతిభ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. హ్యాట్రిక్ వికెట్లు తీసి ఏకంగా శ్రీలంకను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ ఒక్కరితో జట్టు గెలవదు కదా మిగతా ఆటగాళ్ల నుండి సరైన సహకారం లేకపోవడంతో చివరికి యూఏఈ జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ చరిత్రలో హ్యాట్రిక్ తీసిన బౌలర్ల జాబితాలో చేరిపోయాడు కార్తీక్. ఇప్పుడు వరకు 2007లో బ్రెట్ లీ, 2021 లో కర్టీస్ కాన్ఫర్, 2021 లో రబడా, అదే ఏడాది వరల్డ్ కప్ లో వానిందు హాసరంగ హ్యాట్రిక్ తీసిన ఆటగళ్లుగా ఉండగా ఇప్పుడు వీరి సరసన చేరాడు కార్తీక్ మేయ్యప్పన్.