రిషబ్ పంత్ కి.. దినేష్ కార్తీక్ బ్యాటింగ్ పాఠాలు?

praveen
రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ ఇద్దరు కూడా ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు అని చెప్పాలి. ఇండియాలో స్థానంపై వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది అని చెప్పాలి. వీరిద్దరూ వికెట్ కీపర్ లు కావడం మంచి ఫినిషర్లుగా గుర్తింపు సంపాదించుకోవడం గమనార్ధం. దీంతో ఇక టీమ్ ఇండియా వరల్డ్ కప్ ఆడబోయే మ్యాచ్లలో తుది జట్టులో ఎవరు స్థానం దక్కించుకుంటారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది. అయితేకాలంలో ఫినిషిర్ గా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న దినేష్ కార్తీక్ కు చోటు దక్కే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు.


 మరి కొంతమంది యువ ఆటగాళ్లు రిషబ్ పంత్ తప్పకుండా తుది జట్టులో ఉంటాడని అనుకుంటూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈనెల 23వ తేదీన పాకిస్తాన్ తో తమ మొదటి మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. ఈ మ్యాచ్ కోసం ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగితేలుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆస్ట్రేలియా తో వార్మప్ మ్యాచ్ ఆడింది టీం ఇండియా. ఈ మ్యాచ్ లో భాగంగా విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఈ వార్మప్  మ్యాచ్ కు ముందు రిషబ్ పంత్ దినేష్ కార్తీక్ ల మధ్య సంభాషణ అక్కడున్న వారందరినీ అక్కడ కూడా ఆకట్టుకుంది. ఏకంగా పిచ్ పై దినేష్ కార్తీక్ రిషబ్ పంత్ నిలబడి ఉన్నారు.


 ఈ క్రమంలోని సీనియర్ క్రికెటర్ దినేష్ కార్తీక్  యువ ఆటగాడు రిషబ్ పంత్ కు ఏదో సూచనలు చేశాడు. ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ రిషబ్ పంత్ కు బ్యాటింగ్ పాఠాలు బోధించి ఉంటాడని క్రికెట్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.  ఇలా ఇద్దరు వికెట్ కీపర్లు కూడా చాలా సేపు చర్చించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కూడా విడివిడిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం గమనార్హం. అయితే ఇటీవల ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ముగించుకున్న టీమిండియా జట్టు ఇక అటు న్యూజిలాండ్తో మరో మ్యాచ్ ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk

సంబంధిత వార్తలు: