కోహ్లీ, బాబర్ కాదు.. అతనే వరల్డ్ బెస్ట్ ప్లేయర్?

praveen
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు ఎవరు అంటే ప్రతి ఒక్కరి నోటి నుంచి ఒకరి పేరు వినిపిస్తుంది . అదే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో సృష్టించిన రికార్డులు అలాంటివి.  ఇప్పటికీ కూడా అదే రేంజ్ లో హవా నడిపిస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లీ తర్వాత నేటి రోజుల్లో ఫామ్ దృశ్య పాకిస్తాన్ కెప్టెన్ అద్భుతమైన క్రికెటర్ గా కొనసాగుతున్నాడు అని అందరూ అంటారు. కానీ ఇటీవలే మాత్రం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ప్రస్తుత ఇంగ్లాండ్ కోచ్ మైకేల్ హస్సి  మాత్రం ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు ఎవరు అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ప్రపంచ కప్ సాధించిన కోచ్ లలో మైఖేల్ హస్సి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుకు హెడ్ కోచ్గా కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఇటీవల ఇంగ్లాండు జట్టు ఆస్ట్రేలియా తో జరిగిన టి20 సిరీస్లో 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల తన 50వ టి20 ఆడుతున్న డేవిడ్ మలన్ గురించి స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ బాబర్ అజాం కన్నా డేవిడ్ మాలన్ మెరుగైన ఆటగాడు అంటూ కొనియాడాడు. అనంతరం తన చేతుల మీదుగానే క్యాప్ అందించాడు.

 నా జీవితంలో నా చేతుల మీదుగా ఇలా ఒకరికి క్యాప్ ను అందించే అవకాశం వస్తుందని నేను ఊహించలేదు. అయితే తన 50వ టి20 ఆడుతున్న డేవిడ్ మాలన్ కు అభినందనలు. ఇప్పటికే నీ కెరియర్లో ఎన్నో గొప్ప విశేషాలు ఉన్నాయ్. ఇంగ్లాండ్ తరఫున సెంచరీలు సాధించిన నలుగురిలో నువ్వు ఒకడివి. టి20 క్రికెట్ చరిత్రలోనే ఎక్కువ స్కోరు చేసిన రెండో ఆటగాడివి.. ఓ సమయంలో ప్రపంచ నెంబర్ వన్ గా కూడా కొనసాగావ్. అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన రికార్డు కూడా నీకు ఉంది. ఇక విరాట్ కోహ్లీ బాబర్ అజం కన్నా నువ్వే గొప్ప ఆటగాడు అని నేను భావిస్తున్నాను. మరో నెల రోజుల్లో ప్రపంచ కప్ కూడా గెలిచి పథకాన్ని అందుకుంటావని భావిస్తున్నా అంటూ మైకేల్ హస్సి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: