పాకిస్తాన్తో మ్యాచ్.. ఆ ఇద్దరి వికెట్ తీస్తే.. భారత్ గెలిచినట్టే?

praveen
వరల్డ్ కప్ లో భాగంగా ఈనెల 23వ తేదీన జరగబోతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో  ఇప్పటికే ఇరు జట్లు కూడా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి ప్రాక్టీస్ మ్యాచ్లలో మునిగి తేలుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే గత ఏడాది వరల్డ్ కప్ లో  టీమ్ ఇండియా పాకిస్తాన్ చేతిలో ఘోర ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది వరల్డ్ కప్ లో విజయం సాధించి ప్రతీకరం తీర్చుకోవాలని భావిస్తుంది టీమిండియా.


 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఇప్పటికే ఎంతోమంది మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో ఇరు జట్ల బలాబబలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయంపై కూడా చర్చించుకుంటున్నారు. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ ఓపెనర్లకు ఏమాత్రం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వకూడదు అంటూ చెప్పుకొచ్చాడు.


 మరి ముఖ్యంగా మహమ్మద్ రిజ్వాన్ పవర్ ప్లే లో అతడే ఎక్కువ స్ట్రైక్  తీసుకుంటాడని.  బాబర్ అజం కాస్త సమయం తీసుకుని పరుగులు చేస్తాడు అంటూ అభిప్రాయపడ్డాడు.  అందుకే పరిస్థితులకు తగ్గట్లుగా ఆ ఇద్దరినీ బోల్తా కొట్టించేలా బంతులను సందించాలి. ఇక ఇద్దరి లెంత్ విషయంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. మహమ్మద్ రిజ్వాన్ స్టంప్స్ లక్ష్యంగా పుల్లర్ బాల్ సందించాలి. లైన్ అండ్ లెంగ్త్ తో మోకాలి మీదకు బంతిని వేయాలి. ఇక బాబర్ విషయానికి వస్తే అతన్ని ఎల్బి అవుట్ చేసేందుకు చూడాలి. ఇక ఇద్దరిని అవుట్ చేస్తే పాకిస్తాన్ ను దెబ్బతీసినట్లే అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: