భారత్ తో మ్యాచ్ కి ముందు.. పాకిస్తాన్ కి గుడ్ న్యూస్?
దీంతో అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఈ నెల 23వ తేదీన పాకిస్తాన్ జట్టు భారత్‌తో తొలి మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఈ మ్యాచ్ కి ముందు అటు పాకిస్తాన్ జట్టుకు ఊహించని రీతిలో శుభవార్త అందింది అన్నది మాత్రం తెలుస్తుంది. మొన్నటి వరకు గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ బ్యాట్స్‌మెన్ ఫకర్ జమన్ పూర్తిగా కోలుకున్నాడు. ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ కి ముందు మోకాలి గాయంతో బాధపడిన ఫకర్ జమాన్ ప్రస్తుతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. అయినప్పటికీ ఇతన్ని టీ20 ప్రపంచ కప్‌కు రిజర్వ్ ఆటగాడిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.
ఇక ఇప్పుడు ఫకర్ జమాన్ పూర్తిగా మోకాలి గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించిన నేపథ్యంలో ఇక 15 మంది ఆటగాళ్లతో కూడిన పాకిస్తాన్ టి20 ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కించుకుంటాడు అన్నది మాత్రం తెలుస్తుంది. అయితే ఫక్కర్ జమాన్ కోలుకున్నప్పటికీ ఇక మరో ఆటగాడు ఉస్మాన్ ఖాదీర్ మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేదు అన్నది తెలుస్తుంది. దీంతో అతన్ని రిజర్వ్ జాబితాలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉంచింది అన్నది తెలుస్తుంది. సెప్టెంబర్ 25న ఇంగ్లాండ్ తో జరిగిన టి20 మ్యాచ్ లో ఉస్మాన్ ఖాదిర్ కు బొటన వేలుకు గాయం కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.