భారత్తో మ్యాచ్.. ఒత్తిడితో కూడుకున్నదే : పాక్ క్రికెటర్
ఈ క్రమంలోనే ఇక ఈ రెండు జట్ల మధ్య పోరు మరోసారి ఉత్కంఠ భరితంగా మారబోతుంది అనేది తెలుస్తుంది. ఇలాంటి సమయంలో ప్రేక్షకులు అందరూ ఈ మ్యాచ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇక ఇరు జట్లకు సంబంధించిన ఆటగాళ్లు కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై స్పందిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదని అందరితో ఆడినట్లుగానే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా ఆడుతాం అంటూ చెబుతున్నారు.. ఇటీవలే ఇదే విషయంపై పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నవాజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు బాగా ఆడుతోంది. ముఖ్యంగా భారత్తో గొప్ప ప్రదర్శన ఇచ్చాం. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ సైతం మా ఆటగాళ్లలో ఎంతగానో ఆత్మవిశ్వాసం నింపింది. ఇక ఇప్పుడు ప్రపంచకప్ కోసం మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. అయితే భారతతో మ్యాచ్ గురించి పెద్దగా ఆలోచన చేయడం లేదు. అది కేవలం పాకిస్తాన్ కు మరో మ్యాచ్ మాత్రమే. ఇక ప్రాక్టీస్ లో నేర్చుకున్న మొత్తాన్ని కూడా మైదానంలో సరిగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక టీమ్ ఇండియా లాంటి పటిష్టమైన జట్టుతో మ్యాచ్ అంటే కాస్త ఒత్తిడితో కూడుకున్నదే. కానీ ఈ మ్యాచ్ తర్వాత మాత్రం అన్ని మ్యాచ్లు కాస్త తేలికైపోతాయి అంటూ మహమ్మద్ నవాజ్ చెప్పుకొచ్చాడు.