కూతురు టీమిండియా కెప్టెన్.. తల్లిదండ్రులు ఇంకా కూలీలే?

praveen
పట్టుదల ఉండాలి కానీ ఎంతటి కష్టమైనా సరే ఎదుర్కొనే ధైర్యం వస్తుంది అన్నది ఇప్పుడు వరకు ఎంతో మంది నిరూపించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న విషయాన్ని నిజం చేసి చూపించారు. ఒకవైపు ఫ్యామిలీని ఆర్థిక సమస్యలు వేధిస్తున్న.. ఇక ఒంట్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్న.. పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రయత్నించి ఎంతో మంది సక్సెస్ సాధించిన వారు ఉన్నారు.. ఇక అలాంటివారి జీవిత కథలు ఎప్పుడూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  నేటి రోజుల్లో క్రీడలలో సినిమా రంగంలో ఇలా అన్ని రంగాలలో కూడా సాదాసీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని అత్యున్నత స్థాయికి ఎదిగిన వారు చాలామంది ఉన్నారు


 ఇక అలాంటి వారిలో ప్రస్తుతం భారత అండర్ 17 ఫుట్బాల్ జట్టు  కెప్టెన్ కూడా ఉన్నారు అని చెప్పాలి. ఇటీవల కాలంలో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్న సమయంలోనే ఇంకా ఏదో కావాలి అనే ఆలోచనతో ఏదీ సాధించలేక పోతున్నారు చాలామంది. ఇలాంటి సమయంలో కనీసం ఊరికి రోడ్డు లేకపోయినప్పటికీ ఒకవైపు ఆర్థిక సమస్యలు వేధిస్తున్నప్పటికీ యువతి మాత్రం తాను అనుకున్నది సాధించింది. ప్రస్తుతం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది అని చెప్పాలి. ఎన్నో కష్టాలను దాటుకుని ప్రస్తుతం అండర్ 17 భారత ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతుంది అష్టమ్ ఉరావ్.


 ఆమె కుటుంబం పడిన కష్టాలు మాత్రం ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి అని చెప్పాలి. ఇప్పుడు ఆమె దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కడుపు నింపుకోవాలంటే మాత్రం తల్లిదండ్రులు కూలి పని చేయక తప్పడం లేదు అన్నది తెలుస్తుంది. మన దేశంలో క్రికెట్ క్రేజ్ కారణంగా మిగతా ఆటలకు సంబంధించిన క్రీడాకారులు జీవితాలు బాగుపడటం లేదు. అదే విదేశాల్లో ఇలా అండర్ 17 జట్టుకు కెప్టెన్ గా ఉంటే వచ్చే ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనదేశంలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఇక ఇటీవల అండర్ 17 జట్టుకు అష్టమ్ ఉరావ్ కెప్టెన్గా మారడంతో.. ఆమెకు గౌరవ సూచికంగా ప్రభుత్వం ఇక ఆమె గ్రామానికి రోడ్డు పనులు చేపట్టింది. అయితే ఈ రోడ్డు పనుల్లో భాగంగా ఆమె తల్లిదండ్రులే కూలీలుగా మారడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: