స్వింగ్ రాకపోతే.. భువనేశ్వర్ కు కష్టమే?

praveen
మరికొన్ని రోజులు ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఏ మేరకు రాణించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. సాధారణంగా ఆస్ట్రేలియాలో ఉండే పిచ్ లు అటు ఫేస్ బౌలింగ్కు మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఇతర పిచ్లతో పోల్చి చూస్తే ఆస్ట్రేలియాలో పిచ్లపై బౌలర్లకు కాస్త ఎక్కువగానే పేస్ లభిస్తుంది. తద్వారా తమ పేస్ బౌలింగ్ తో బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టడానికి అవకాశం  ఉంటుంది. అయితే టీమిండియా జడ్డులో కీలక బౌలర్ గా ఉన్న బుమ్రా  గాయం కారణంగా దూరమయ్యాడు.


 ఇప్పుడు ఇక టీమిండియా బౌలింగ్ విభాగం బాధ్యతలను మొత్తం మరో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే అతను ఎలా రాణించగలడు అనే విషయంపై ఎంతోమంది మాజీ క్రికెటర్ స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. ఇదే విషయం పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ కూడా స్పందించాడు. కొత్తబంతి తో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు.  అయితే అతని ఫేస్ తోనే సమస్య వచ్చే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.


 సాధారణంగా భువనేశ్వర్ కుమార్ స్వింగ్ బౌలింగ్తో మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. కానీ ఆస్ట్రేలియాలో ఉండే బౌన్సి పిచ్లపై బంతి స్వింగ్ కాకపోతే మాత్రం భువనేశ్వర్ కుమార్కు ఇబ్బందులు తప్పవు అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. అతను గొప్ప బౌలర్ అనే మాటలో మాత్రం ఎలాంటి సందేహం లేదని.. ఇరువైపులా బంతిని స్వింగ్ చేయగలడు.. అద్భుతమైన యార్కర్లను కూడా సంధిస్తాడు. అయితే ఆస్ట్రేలియా పిచ్ లపై మాత్రం ఫేస్ చాలా కీలకం. యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను తీసుకొని ఉంటే ఉపయోగముండేది. ఎందుకంటే అతను చక్కగా పేస్ రాబడతాడు అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: