ఇది గురూ.. కోహ్లీ రేంజ్ అంటే.. ఫోటో వైరల్?
అయితే కేవలం రికార్డులు సాధించడం విషయంలోనే కాదు ఫ్యాన్స్ ప్రేమాభిమానాలు సొంతం చేసుకోవడంలో ఇక సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడంలో కూడా అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్లు అందరితో పోల్చి చూస్తే ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడుతున్నాడు అంటే చాలు ఇక భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ఇతర దేశాల ప్రేక్షకులు సైతం స్టేడియంకు వచ్చి మ్యాచ్ వీక్షిస్తూ తమ అభిమాన క్రికెటర్ కు మద్దతు ఇస్తూ ఉంటారు అని చెప్పాలి.
అయితే కోహ్లీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ మరో ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇటీవల భారత్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఉప ప్రధానికి విరాట్ కోహ్లీ సంతకం చేసిన ఒక బ్యాట్ ని గిఫ్ట్ గా ఇచ్చారు జయశంకర్. ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇది చూసిన ఎంతోమంది కోహ్లీ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కోహ్లీ రేంజ్ అంటే ఇది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం . మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో కోహ్లీ సత్తా చాటుతాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.