ప్చ్.. రోహిత్ మళ్లీ నిరాశపరిచాడు?
అయితే కెప్టెన్సీ వ్యూహాల పరంగా రోహిత్ సక్సెస్ అవుతున్నప్పటికీ ఒక బ్యాట్స్మెన్ గా మాత్రం గత కొంతకాలం నుంచి సక్సెస్ కాలేకపోతున్నాడు. ఓపెనర్ గా వచ్చి భారీగా పరుగులు చేసి మంచి ఆరంభాలు అందించే రోహిత్ శర్మ ఇటీవల కాలంలో తక్కువ పరుగులకే వికెట్ కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా రోహిత్ శర్మ ఫామ్ అభిమానులు అందరిని కూడా కలవరపెడుతుంది అని చెప్పాలి. అయితే ఇటీవలే వరల్డ్ కప్ నేపథ్యంలో ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది టీం ఇండియా జట్టు. ఈనెల 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో మ్యాచ్ జరగనుండగా ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతుంది టీమిండియా.
ఇటీవల ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా టీమిండియా మరోసారి విజయాన్ని సాధించింది. 13 పరుగుల తేడాతో విజయ డంక మోగించింది. అంతా బాగానే ఉన్నా రోహిత్ శర్మ మాత్రం మరోసారి నిరాశపరిచాడు. సారధిగా జట్టును గెలిపించిన రోహిత్ శర్మ.. బ్యాట్స్మెన్ గా మాత్రం కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు.. రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్ ఓపెనింగ్ జోడీగా బలిలోకి దిగారు. అయితే రోహిత్ మూడు పరుగులకే వికెట్ కోల్పోతే రిషబ్ పంత్ తొమ్మిది పరుగులు చేసి ఎవిలియన్ చేరాడు. ఇక ఇద్దరు ఓపెనర్లు చేతులెత్తేగా ఆ తర్వాత బ్యాట్స్మెన్లు టీమ్ ఇండియాను ఆదుకొని విజయాన్ని అందించారు. కాగా రోహిత్ శర్మ పేలువమైన ఫామ్ అభిమానులను మరింత ఆందోళనలో పడేస్తుంది.