ఇండియా బౌలింగ్ లో పసలేదు సామీ... !

VAMSI
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జట్టు ఇండియా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఇండియాతో మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే లు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ రెండు టీ 20 లు పూర్తి అయిపోయి సౌత్ ఆఫ్రికా సిరీస్ ను కోల్పోయింది. ఇక నామమాత్రం అయిన చివరి మ్యాచ్ ఇండోర్ వేదికగా సాయంత్రం 7 గంటలకు జరగనుంది. కాగా జరిగిన రెండు మ్యాచ్ లు కూడా ఏకపక్షముగా సాగినా రెండవ మ్యాచ్ లో మాత్రం మ్యాచ్ ను ఇండియా గెలుచుకున్నా, సౌత్ ఆఫ్రికా మాత్రం అభిమానుల మనసును గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 236 పరుగులు చేసింది. కానీ ఇక్కడే ఇండియా మ్యాచ్ ను గెలుచుకుంది.
కానీ డికాక్ మరియు మిల్లర్ లు చివరి బంతి వరకు పోరాడారు.. వాస్తవంగా డికాక్ చాలా నెమ్మదిగా ఆడాడు. మిల్లర్ లా ఆడి ఉంటే విజయ ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాకు దక్కేది. అయితే డికాక్ క్రీజులో అంత సౌకర్యవంతంగా కనిపించలేదు. ఇదిలా ఉంటే రెండవ మ్యాచ్ లో భారత్ బౌలింగ్ చూశాక అంత స్కోర్ చేసినా చివరి వరకు తీసుకువచ్చారు అంటే బౌలింగ్ ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క దీపక్ చాహర్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేశాడు. మిగిలిన బౌలర్లు అక్షర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్ మరియు అర్ష్ దీప్ సింగ్ లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వీరి బౌలింగ్ లో అసలు పదును లేదు. మిల్లర్ ను అస్సలు ఇబ్బంది పెట్టలేకపోయారు. మిల్లర్ గ్రౌండ్ కు అన్ని వైపులా చూడచక్కని షాట్ లు ఆడి సెంచరీ సాధించాడు.
ఈ రోజు మ్యాచ్ లో అయినా బౌలర్లు తమ సత్తా చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక పరువు కోసం ఆఖరి మ్యాచ్ లో గెలవాలని సౌత్ ఆఫ్రికా ప్లాన్ చేస్తోంది. ఇండియా మాత్రం క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. కాగా నామమాత్రం మ్యాచ్ కావడంతో ఈ రోజు ఇరు జట్లలో కీలక మార్పులు ఉండే అవకాశం ఉంది. బెంచ్ కు పరిమితం అయిన వారిని ఆడించే అవకాశం ఉంది. కాగా ఈ రోజు కూడా టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కు మొగ్గు చూపుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: