సిక్సర్లలో.. సూర్య కుమార్ ప్రపంచ రికార్డు?

praveen
సాధారణంగా ఉత్కంఠ భరితంగా  క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎంతోమంది బ్యాట్స్మెన్లు వికెట్ కాపాడుకుంటూ ఆచీతూచి ఆడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇలా సమయం వచ్చినప్పుడు మంచి షాట్లు ఆడుతూ భారీగా పరుగులు చేయాలని భావిస్తూ ఉంటారు. కానీ కొంతమంది బ్యాట్స్మెన్లు మాత్రం ఎంతసేపు క్రేజీలో ఉన్నాం అన్నది కాదు ఉన్నంతసేపు విద్వంశం సృష్టించామా లేదా ప్రేక్షకులకు అసలుసిసలైన ఎంటర్టైన్మెంట్ పంచామా లేదా అన్నదే ముఖ్యం అన్న విధంగా ఆడుతూ ఉంటారు. ఇక అచ్చం ఇలాగే బ్యాటింగ్ చేసే వారిలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ముందు వరుసలో ఉంటాడు.

 క్రీజ్ లోకి వచ్చింది మొదలు ప్రతి బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పవర్ హిట్టింగ్ చేస్తూ ఉంటాడు హార్దిక్ పాండ్యా. అయితే ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా తో పాటు టీమ్ ఇండియా జట్టులో మరో ఆటగాడి పేరు మారుమోగిపోతుంది. అతనే సూర్యకుమార్ యాదవ్. ఇతను కూడా క్రీజులో ఎంతసేపు ఉన్నామన్నది కాదు సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి  విధ్వంసం సృష్టించామా లేదా అన్నది ముఖ్యం అన్న విధంగా తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల కాలంలో టీమిండియాలో 4వ స్థానంలో నమ్మదగిన బ్యాట్స్మెన్ గా మారిపోయిన సూర్యకుమార్ యాదవ్ ప్రతీ మ్యాచ్లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.

 ఇక మైదానం నలువైపులా కూడా ఎంతో అలవోకగా మ్యాచ్లు ఆడుతున్న సూర్య కుమార్ యాదవ్ మిస్టర్ 360 గా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇటీవలే సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి20 మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ తో అదరగొట్టేసాడు. ఈ క్రమంలోని ఒక ప్రపంచ రికార్డును కొల్లగొట్టాడు సూర్య కుమార్ యాదవ్.  సిక్సర్లలో అందరిని దాటేసి ముందుకు వెళ్లిపోయాడు. ఇప్పటివరకు ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా అగ్రస్థానంలోకి వచ్చేసాడు సూర్య కుమార్ యాదవ్. ఒక క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటి వరకు సూర్యకుమార్ 45 సిక్సర్లు కొట్టాడు   అంతకు ముందు 2021లో రిజ్వాన్, మార్టిన్ గప్టీల్ 42 సిక్సర్లతో రికార్డు సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: