
బీసీసీఐ కొత్త రూల్.. మ్యాచ్ మధ్యలో ఆటగాళ్ల మార్పు?
సబ్స్టిట్యూట్ ఆటగాడి విషయంలో సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ అనే నయా రూమ్ ను అమలులోకి తీసుకు రాబోతుంది. ఇక ఈ రూల్ అమల్లోకి వచ్చింది అంటే చాలు ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాడిని మార్చుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం ఇన్నింగ్స్ ప్రారంభమైన తర్వాత 14 ఓవర్ల లోపు ఇరు జట్ల నుంచి ఒక్కో ఆటగాడిని మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
తద్వారా మ్యాచ్ మధ్యలో ఆటగాడికి గాయం అయినా లేదా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కూడా స్థానంలో మరో ఆటగాడిని మైదానంలో బరిలోకి దింపేందుకు అవకాశం ఉంది. కాగా రూల్ ప్రకారం సబ్స్టిట్యూట్ ప్లేయర్ కేవలం ఫీలింగ్ మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఇంపాక్ట్ రూల్ ప్రకారం 14 ఓవర్ల లోపు ఎవరైనా ఆటగాడు గాయపడినా లేదా మ్యాచ్ అప్పటి స్థితిగతులను బట్టి ఆటగాడిని మార్చుకోవాలని భావించిన ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ తో పాటు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ రూల్ కేవలం క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించే బిగ్ బాష్ లీగ్ లో మాత్రమే అమల్లో ఉంది.