ఇకనైనా అలాంటివి ఆపండి.. ఇండియాకు గవాస్కర్ సూచన?
చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో టీమ్ ఇండియా పరాజయం పాలుకావడం పై అటు ఎంతో మంది మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి. కొంతకాలం నుంచి టీమిండియా యాజమాన్యం జట్టులో వరుసగా ప్రయోగాలు చేస్తూ ఉండటం కారణంగానే టీమిండియా ఇలా ఓటమి పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా యాజమాన్యం ప్రయోగాలకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైంది అన్నాడు.
ఆసియా కప్ టి20 ప్రపంచ కప్లో ఆడే ఆటగాళ్ల లో ఎక్కువ మందిని జింబాబ్వే పర్యటనకు పంపించి ఉంటే బాగుండేది. అలా కాకుండా కేవలం నలుగురైదుగురునీ మాత్రమే జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేశారు.. జింబాబ్వే పర్యటనలో రాణించిన వారికి ఆసియాకప్ తుది జట్టులో చోటు దక్కలేదు. అందుకే మిగతా వాళ్లకు కుదురు కోవడానికి కాస్త సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఇకనైనా టి20 ప్రపంచ కప్ జరిగే లోపు ఇండియా ప్రయోగాలకు స్వస్తి పలికితే బెటర్. పని ఒత్తిడి కారణంగా విశ్రాంతి ఇస్తున్నామని మాటలు ఇప్పటికన్నా ఆపాలి. ఆసియా కప్ నుంచి ముందుగానే వైదొలిగిన నేపథ్యంలో మూడు రోజులు రెస్ట్ దొరుకుతుంది. ఈ గ్యాప్ లో ఆస్ట్రేలియాతో సిరీస్ కు సిద్ధం కావాలి అంటూ వ్యాఖ్యానించాడు.