జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఘోర పరాజయం !

VAMSI
ఈ రోజును జింబాబ్వే దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే క్రికెట్ లో ఆస్ట్రేలియా సత్తా ఏమిటో అందరికీ తెలిసిందే. ప్రపంచంలో అన్ని జట్లను ఓడించి విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్ ను గతంలో ఎప్పుడూ తన ప్రాభవం కోల్పోయి మళ్ళీ ఇప్పుడిప్పుడే బుడి బుడి అడుగులు వేస్తున్న కొత్త జింబాబ్వే జట్టు ఘోరంగా ఓడించింది. నిజంగా ప్రపంచ క్రికెట్ ఈ విషయాన్ని నమ్మలేకపోతోంది. కానీ ఇదే వాస్తవం.. ఈ రోజు ఉదయం ఆస్ట్రేలియా మరియు జింబాబ్వే జట్ల మధ్యన మూడవ వన్ డే జరిగింది. ఇప్పటికే సిరీస్ ను ఆస్ట్రేలియా కు కోల్పోయిన జింబాబ్వే క్లీన్ స్వీప్ కు దగ్గరైంది. కానీ మ్యాచ్ ఆరంభం అయిన గంటకే ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం చూపించింది.

టాస్ గెలిచిన జింబాబ్వే మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కనీసం ఈ మ్యాచ్ లో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలనుకుంది. అయితే అందుకు తగినట్లే జింబాబ్వే ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను అల్లాడించారు . ఒక్క డేవిడ్ వార్నర్ మాత్రమే 94 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 141 కు చేర్చాడు. అయితే పార్ట్ టైం బౌలర్ ర్యాన్ బుర్ల్ చెలరేగి 5 వికెట్లు సాధించి ఆసీస్ పతనాన్ని శాసించాడు. కానీ ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎదుర్కొని సాధిస్తుందా అని అనుకున్న వారు కూడా లేకపోలేదు.

ఎందుకంటే రెండవ వన్ డే లో కేవలం 96 పరుగులకే అల్ అవుట్ అయ్యారు. అయితే ఇవనీ తలకిందులు చేస్తూ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి అద్భుతమైన రికార్డు ను సొంతం చేసుకుంది జింబాబ్వే. ముందుగా... బంగ్లాను ఓడించి, ఇండియాను షేక్ చేసి ఇప్పుడు ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ఇక ముందు ముందు ఎన్ని విజయాలు సాధిస్తుంది అనేది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: