పంత్ పై మళ్ళీ వేటు తప్పదా.. కారణం అదే?

praveen
రిషబ్ పంత్ టీమిండియా లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఎంత గుర్తింపు సంపాదించుకున్నాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ప్రస్తుతం టీమిండియా లో కీలక ఆటగాడిగా మారిపోయాడు.  అయితే ఇటీవలే ఆసియా కప్లో కూడా భారత జట్టుకు ఎంపికయ్యాడు.  కానీ రిషబ్ పంత్ లాంటి కీలక ఆటగాడు కేవలం బెంచ్  కి మాత్రమే పరిమితం అవుతున్నాడు.  జట్టు సమతూకం కోసం ఆలోచించిన టీమిండియా యాజమాన్యం  రిషబ్ పంత్ కి బదులు ఇక ఫినిషర్ రోల్ పోషిస్తున్న దినేష్ కార్తీక్ ను తుది జట్టులోకి తీసుకుంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఈ కారణంగానే అటు పాకిస్థాన్తో జరిగిన కీలకమైన మ్యాచ్కి రిషబ్ పంత్ ను పక్కనబెట్టింది.


 ఆ తర్వాత హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో అతన్ని తుది జట్టులోకి తీసుకున్నప్పటికీ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు అని చెప్పాలి. సూపర్ ఫోర్ దశ మ్యాచులకు ముందు హార్దిక్ పాండ్యా లాంటి కీలకమైన ఆల్రౌండర్ గాయాల బారిన పడకూడదు అనే ఉద్దేశంతోనే ఇక రిషబ్ పంత్ ను  జట్టులోకి హార్దిక్ పాండ్యా స్థానంలో తీసుకున్నట్లు స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ క్రమంలోనే సూపర్ ఫోర్ మ్యాచ్ లకి మళ్ళీ పాకిస్థాన్తో తలపడాల్సి వస్తే రిషబ్ పంత్ కు  ఒక అవకాశం కల్పిస్తారా లేకపోతే హార్దిక్ పాండ్యా జట్టులోకి ఎంట్రీ ఇస్తే కేవలం బెంచికి మాత్రమే పరిమితం చేస్తారా అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.


 ఇదే విషయంపై ఎంతోమంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు.  రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకోవాలని కొంతమంది వాదిస్తుంటే..  మరికొంతమంది దినేష్ కార్తీక్ జట్టులో ఉండటమే బెటర్ అంటూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక సూపర్ ఫోర్ దశలో మరోసారి టీమ్ ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్  జరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్  శ్రీలంక జట్లకు షాకిచ్చి  పటిష్టంగా కనిపిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ తో కూడా మ్యాచ్ కు  ఉంది.  ఇలాంటి సమయంలో   కార్తీక్ ను పక్కన పెట్టి సాహసం  జట్టు యాజమాన్యం  చేయకపోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: