రోహిత్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది : గంభీర్

frame రోహిత్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది : గంభీర్

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలుచుకునే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇటీవలే ఆసియా కప్లో భాగంగా ఎంత ఉత్కంఠభరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఇక ఇరు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్టు గానే హోరాహోరీగా పోటీపడ్డాయ్ అనే చెప్పాలి. ఇక చివర్లో వచ్చిన భారత బ్యాట్స్మన్ హార్దిక్ పాండ్యా తన బ్యాట్ తో మెరుపులు మెరిపించటంతో చివరికి టీమిండియాకు విజయం లాంఛనం అయింది అని చెప్పాలి. అయితే ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. గత ఏడాది టి20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్  పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది అనే చెప్పాలి.


 ఒకవైపు జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటూ టీమిండియాను విజయ తీరాల వైపు ఉండేలా చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక టీమిండియా గెలవడంలో హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ లో ఆడారు. అయితే తుది జట్టులో మంచి ఫామ్లో ఉన్న రిషబ్ పంత్ ను కాదని దినేష్ కార్తీక్ చోటు కల్పించడం గమనార్హం. ఇటీవలి కాలంలో మంచి ఫినిషర్ గా పేరు పొందాడు దినేష్ కార్తీక్. దీంతో యువ బ్యాట్స్ మెన్ ను కాదని దినేష్ కార్తీక్ ను టీం లోకి తీసుకున్నారు.


 ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో 50 రోజుల్లో టి20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో టీమిండియా ఇలాంటి ప్రయోగాలు చేయడం మంచిది కాదు అంటూ సూచించాడు. ఆసియా కప్ ముగిసిన తర్వాత ప్రపంచ కప్ లో భారత్ మహా అయితే అయిదారు మ్యాచ్లను ఆడే మాత్రమే అవకాశం ఉంది. అందుకే ఈ లోపే తుది జట్టు ఏంటి అన్న దానిపై ఒక స్పష్టతకు రావాలి. అలాగే బ్యాకప్ సిద్ధంగా ఉంచుకోవడం కూడా ఎంతో మంచిది. ఇలాంటి సమయంలో కీలక ఆటగాడు రిషబ్ పంత్ ను తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మిడిల్ ఆర్డర్ లో తప్పనిసరిగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్  ఉండాలి. టీమిండియాలో ఇప్పటికే ఎంతోమంది కుడిచేతి వాటం బ్యాట్స్మన్ ఉన్నారు. రిషబ్ పంత్  ఉంటే ఓపెనర్గా మాత్రమే కాదు మిడిలార్డర్లో కూడా పని చేస్తాడు. అతన్ని  పక్కన పెట్టడం ఎక్కువకాలం కొనసాగదు అని భావిస్తున్నా అంటూ గౌతం గంభీర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: