
బాబర్.. నువ్వు చేసిన తప్పే.. పాక్ కొంపముంచింది?
పాకిస్తాన్ బౌలర్లలో నవాజ్ మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కీలకమైన బ్యాట్స్మెన్ల వికెట్లను పడగొట్టాడు. అయితే ముందుగా మంచి ప్రదర్శన చేసిన నేపథ్యంలో ఇక ఈ ఎడమ చేతి వాటం స్పిన్నర్ తన కోటలో మిగిలివున్న ఒక్క ఓవర్ చివరకు వేయావలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అతనికి లాస్ట్ ఓవర్ బౌలింగ్ ఇచ్చాడు కెప్టెన్ బాబర్. అయితే ఇటీవల ఇదే విషయాన్ని తప్పుపట్టాడు మాజీ ఆటగాడు వసీం అక్రమ్. నవాజ్ చేత బౌలింగ్ చేయించి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం పెద్ద తప్పు చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు.
భారత్ పాకిస్తాన్ మధ్య మంచి క్రికెట్ గేమ్ సాగింది. చివరి ఓవర్ వరకు కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే నవాజ్ ను బౌలింగ్ 13, 14 ఓవర్ లో చేయించి ఉంటే బాగుండేది.. ముందుగా వేయించుకకుండా ఒక ఓవర్ ఆపి చివరికి బాబర్ అజాం భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా ఎలాంటి హిట్టర్లు క్రీజులో ఉండగా ఇలాంటి తరహా బౌలింగ్ సబబు కాదు అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కఠినమైన పరిస్థితిలో పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా అద్భుతంగా బౌలింగ్ చేశారు అంటూ ప్రశంసించాడు వసీం అక్రమ్. ఇలా కెప్టెన్ బాబర్ అజాం ఈ ఒక్క తప్పు చేయకుంటే పాకిస్తాన్ గెలిచేది అంటూ వ్యాఖ్యానించాడు.