పాకిస్తాన్ పై.. భువనేశ్వర్ అరుదైన రికార్డు?

praveen
ఇటీవల ఆసియా కప్ లో భాగంగా భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం మ్యాజిక్ చేసి చూపించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పాకిస్థాన్ జట్టులో కీలక బ్యాట్స్మెన్గా కొనసాగుతున్న అందర్నీ కూడా వరుసగా పెవిలియన్ పంపించడంలో సక్సెస్ అయింది భారత బౌలింగ్ విభాగం. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలో  అద్భుతమైన బంతులను సందిస్తూ పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించారు అని చెప్పాడు. ఈ క్రమంలోనే వరుసగా ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను పెవిలియన్కు పంపించింది తద్వారా 19.4 ఓవర్లలోనే 147 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది పాకిస్తాన్ జట్టు.

 ఇక ఆ తర్వాత భారత జట్టు బ్యాటింగ్ చేయగా పాకిస్తాన్ బౌలర్లు కూడా అదేరీతిలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. తద్వారా మ్యాచ్ అనుకున్న దానికంటే మరింత ఉత్కంఠగా మారింది.  ఈ పోరులో చివరకు ఐదు వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే భువనేశ్వర్ అద్భుత ప్రదర్శన పై ప్రస్తుతం అందరి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్లో భాగంగా నాలుగు ఓవర్లు వేసిన భువనేశ్వర్ కుమార్ తక్కువ పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.. ఈ క్రమంలోనే టీ-20 ఫార్మెట్లో పాకిస్థాన్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో తన రెండో వికెట్ గా ఆసిఫ్ అలీనీ అవుట్ చేసిన అనంతరం భువనేశ్వరి రికార్డు సాధించాడు అని చెప్పాలి.

 ఇప్పుడు వరకు భారత చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ జట్టుపై భువనేశ్వర్ కుమార్ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఇదే అత్యధికం. అయితే అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉండేది. పాకిస్తాన్ పై ఆరు వికెట్లు పడగొట్టి ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగాడు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో తొమ్మిది వికెట్లతో భువనేశ్వరి తొలిస్థానంలో ఉంటే హార్దిక్ పాండ్యా ఏడు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో ఇటీవలే హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: