షాహిన్ ఆఫ్రిది లేకపోతే ఏంటి.. ఆ ముగ్గురు ఉన్నారు : పాక్ కోచ్
తద్వారా గత ఏడాది టి20 ప్రపంచ కప్ లో ఇండియాను కష్టాల్లోకి నెట్టాడు అని చెప్పాలి. అలాంటి కీలకమైన బౌలర్ దూరం కావడం తో ఇక పాకిస్థాన్ జట్టు బౌలింగ్ విభాగం కాస్త బలహీన పడింది అని చెప్పాలి. అతని ప్లేస్ లో ఒక యువ ఆటగాడు తీసుకునేందుకు జట్టు యాజమాన్యం సిద్ధమైంది. ఈ నెల 28వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతున్న వేళ పాక్ హెడ్ కోచ్ ముస్తాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొద్ది రోజుల నుంచి మా జట్టులో ముగ్గురు బౌలర్లు ప్రణాళికను విజయవంతం గా అమలు చేస్తున్నారు.
హెడ్ కోచ్ గా నేను కెప్టెన్గా బాబర్ మిగతా సహాయ సిబ్బంది అందరి ప్రతిభాపాటవాలు పై నమ్మకం కూడా ఉంది. పాకిస్తాన్ బౌలింగ్ విభాగానికి షాహీన్ అఫ్రిది నాయకత్వం వహించేవాడు. ప్రస్తుతం అఫ్రిది లేకపోయినప్పటికీ నసీం షా, మహ్మద్ హస్నైన్, హరీస్ రావుఫ్ రూపంలో మా బౌలింగ్ దళం పటిష్టంగానే ఉంది. ముగ్గురు బౌలర్లు కూడా తనదైన రోజున చెలరేగిపోతారు. భారత జట్టుకు గట్టి సవాల్ విసురుతాడు అంటూ ధీమా వ్యక్తం చేశాడు ముస్తాక్.