ఆసియా కప్ లో.. టీమిండియాకు కొత్త కోచ్?
ఇప్పటికే జట్టులో కీలక బౌలర్లు గా కొనసాగుతున్న జస్ప్రిత్ బూమ్రా హర్షల్ పటేల్ జట్టుకు దూరమయ్యారూ. ఈ క్రమంలోనే భువనేశ్వరి నేతృత్వంలోనే ఆసియా కప్లో బౌలింగ్ విభాగం ఎటాక్ చేయబోతోంది. ఇక ఇప్పుడు టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. తన కోచింగ్ తో టీమ్ ను ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న రాహుల్ ద్రవిడ్ కరోనా వైరస్ బారిన పడ్డాడు అనేది తెలుస్తుంది. దీంతో నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా కొనసాగుతున్న వీవీఎస్ లక్ష్మణ్ ఇక ఆసియా కప్ లో టీమిండియాకు కోచ్గా వ్యవహరించ పోతున్నారట.
ఇక దీనిపై అటు బీసీ అధికారికంగా నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది. ఆసియా కప్ పూర్తి అయ్యేంత వరకూ కూడా అటు లక్ష్మణ్ టీమిండియాకు హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టబోతున్నారట. కరోనా వైరస్ బారిన పడిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ఆయన కోలుకున్న తర్వాత తిరిగి జట్టుతో చేరుతారని బిసిసిఐ పేర్కొంది. అయితే ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వివిఎస్ లక్ష్మణ్ ఇటీవల జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీం ఇండియాకు కోచ్గా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే.