రాహుల్ త్రిపాఠి, గైక్వాడ్ లకు ఛాన్స్ రాకపాయె ?
కాగా ఈ సిరీస్ కు దాదాపు చాలా మంది జూనియర్ ఆటగాళ్లు రావడం విశేషం. ఎందుకంటే మరో వారం రోజుల్లో ఆసియా కప్ ఉండడంతో విశ్రాంతి అవసరం అని భావించిన టీం యాజమాన్యం సీనియర్ లను ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు. అలా ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడి రాహుల్ త్రిపాఠి మరియు చెన్నై స్టార్ ప్లేయర్ ఋతురాజ్ గైక్వాడ్ లు కూడా ఈ సిరీస్ కు ఎంపిక అయ్యారు. కనీయం వీరికి ఈ సిరీస్ లో ఆడదానికి ఒక మ్యాచ్ లో అయినా అవకాశం వస్తుంది అని వీరు, ఫ్యామిలీ మరియు అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారు.
కానీ వీరొకటి అనుకుంటే టీం ఇండియా కోచ్ మరియు కెప్టెన్ వేరొకటి అనుకున్నారు. జరిగిన మూడు వన్ డే లలో ఒక్క మ్యాచ్ లోనూ అవకాశం ఇవ్వకుండా సిరీస్ ను ముగించారు. ఎలాగో వరుసగా రెండు మ్యాచ్ లు ఇండియా గెలిచి సిరీస్ ను అందుకుంది. ఇక నామమాత్రం అయిన మూడవ వన్ డే లో అవకాశం ఇవ్వొచ్చు కదా... కానీ అలా జరగలేదు.. మళ్ళీ వీరిని బెంచ్ కే పరిమితం చేశారు. ఇక ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు ఏమో? ముఖ్యంగా రాహుల్ త్రిపాఠికి మళ్ళీ అవకాశాలు వస్తాయా రావా అన్నది ఎవ్వరూ చెప్పలేము.