జడేజా ఉన్నంతకాలం.. అతనికి ఛాన్స్ కష్టమే?
ఈ క్రమంలోనే ఎంతో మంది యువ ఆటగాళ్లు ఇలా జట్టులో స్థానం సంపాదించుకునీ అంతలోనే మళ్ళీ స్థానం కోల్పోతున్నారు అనే చెప్పాలి. వెరసి రోజురోజుకు టీమిండియాలో తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఇక ఇదే పోటీ పై స్పందిస్తున్న ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. జట్టులో ఎవరికీ ఛాన్స్ దక్కుతుంది ఎవరు నిరీక్షణగా ఎదురు చూడాల్సి వస్తుంది అన్న విషయం పై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు ప్రస్తుత కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం టీమిండియా జట్టులో కొనసాగుతోన్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు షాడోగా అక్షర్ పటేల్ ఉన్నాడని మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇద్దరూ కూడా బౌలింగ్ బ్యాటింగ్ చేయగల సమర్థులు అంటూ తెలిపాడు ఆకాష్ చోప్రా. అయితే రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండి భారత జట్టుకు అందుబాటులో ఉన్నంతకాలం అక్షర్ పటేల్ కు కీలక టోర్నీలో అవకాశం దొరకడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుంటూ అక్షర్ పటేల్ బాగా రాణిస్తున్నాడు అంటూ ఆకాశ్ చోప్రా తెలిపాడు. కాగా ఇటీవలే కాలంలో రవీంద్ర జడేజా తో పాటు అటు అక్షర్ పటేల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.