మరికొన్ని రోజుల్లో ఆసియా కప్.. అభిమానులను వణికిస్తున్న జెర్సీ సెంటిమెంట్?

praveen
సాధారణంగా క్రికెట్ లో చాలా సెంటిమెంట్స్ ఉంటాయి అన్న విషయం తెలిసిందే . ఎంతలా అంటే ఏకంగా ఆటగాళ్లు వేసుకునే జెర్సీ జట్టు విజయాన్ని నిర్ణయిస్తుంది అని ఎంతో మంది ప్రేక్షకులు నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్ కప్ లో విజయాన్ని అందించిన జెర్సీ మార్చి కొత్త జెర్సీ వాడటం వల్ల 2019 వన్డే వరల్డ్ కప్ టీమ్ ఇండియా ఓడిపోయిందని ఎంతోమంది అప్పట్లో సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. 2021 టి20 వరల్డ్ కప్ కి ముందు కూడా టీమిండియా జెర్సీలో మార్పులు వచ్చాయి.

 అయితే గత ఏడాది సెకండ్ పేస్ ముగిసిన తర్వాత వార్మప్ మ్యాచ్ల్లో అద్భుతమైన విజయాలు అందుకుంది భారత జట్టు. కానీ తీరా ప్రపంచకప్ మొదలైన తర్వాత మాత్రం భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి చివరికి తేలిపోయింది ఇండియా. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలోనే మొట్టమొదటిసారి పాకిస్థాన్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని తీవ్ర విమర్శల పాలైంది. తర్వాత కొన్ని రోజులకు జెర్సీ మరోసారి మార్చింది బీసీసీఐ. కాగా ప్రస్తుతం డార్క్ బ్లూ కలర్ లో జెర్సీ కొనసాగుతుంది. అయితే ఆసియా కప్ 2022  లో కూడా కొత్త జెర్సీ తో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది భారత్.

 ప్రస్తుత జెర్సీలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా సిరీస్ను కైవసం చేసు కుంటూ జైత్రయాత్ర కొనసాగిస్తుంది అనే చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక ఆసియా కప్ టోర్నీ తో పాటు వరల్డ్ కప్ కోసం కూడా కొత్త జెర్సీ తీసుకువచ్చే అవకాశం ఉంది అని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో అలాంటి ఆలోచనను విరమించుకోవాలని బీసీసీఐని కోరుతున్నారు అభిమానులు. జెర్సీ  మారితే మరోసారి భారత జట్టుకు పరాభవం తప్పదు అంటూ భయపడుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే మరికొద్దిరోజుల్లో ప్రారంభం కాబోయే ఆసియా కప్ లో ఎలాంటి జెర్సీ తో భారత ఆటగాళ్లు బరిలోకి దిగుతారు అనేది ఆసక్తికరం గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: