కోహ్లీ అలా చేస్తున్నాడు.. కానీ బాబర్ అయితేనా : పాక్ మాజీ

praveen
మొన్నటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగి సెంచరీలతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ.. గత కొంత కాలం నుంచి మాత్రం వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. బిసిసీఐ అతనికి అవకాశాలు ఇస్తున్నప్పటికీ సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు అని చెప్పాలి. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

 ఇప్పటికే 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ 71 సెంచరీ కోసం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ క్రికెటర్లు కూడా కోహ్లీ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మాత్రం కోహ్లీని తక్కువ చేస్తూ కామెంట్ చేశాడు. అతను ఎవరో కాదు ఆకిబ్ జావేద్. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం తో విరాట్ కోహ్లీని పోల్చుతూ సెటైరికల్ కామెంట్స్ చేశాడు.. విరాట్ కోహ్లీ ఎక్కువ కాలం బ్యాడ్ ఫామ్లో ఉన్నాడు. అదే బాబర్ అజాం, కేన్ విలియంసన్, జో రూట్ లాంటి ఆటగాళ్లు ఫామ్ కోల్పోతే ఫామ్ లోకి వచ్చేందుకు కచ్చితంగా ఇంత టైం అయితే తీసుకోరు.

 అయితే క్రికెట్ లో రెండు రకాల ఆటగాళ్లు ఉంటారు. ఒకరు ఫామ్ కోల్పోతే వెంటనే తమ తప్పును తెలుసుకొని మళ్లీ వెంటనే ఫామ్ లోకి వచ్చి పుంజు కుంటారూ.  బాబర్ అజాం, కేన్ విలియమ్సన్, జో రూట్ లాంటి ఆటగాళ్లు ఈ కోవకు చెందినవారే. కోహ్లీ మాత్రం రెండోరకం ఫామ్ కోల్పోవడంతో తన టెక్నిక్ ను మార్చుకుని మరింత అయోమయానికి గురవుతున్నాడు. ఆఫ్ సైడ్ దూరంగా వెళుతున్న బంతులను ఆడేందుకు కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆ బంతులను వాడకుండా ఉండేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇలా కాకుండా అతడు ఫ్రీగా పడి భారీ ఇన్నింగ్స్ చేస్తే ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది అంటూ జావేద్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: