కామన్వెల్త్ లో అదిరిపోయే ప్రదర్శన.. రేణుక సింగ్ అత్యుత్తమ ర్యాంక్?

praveen
ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది అన్న విషయం తెలిసిందే. మొదటిసారి కామన్వెల్త్ క్రీడలలో క్రికెట్ అర్హత సాధించిన నేపథ్యంలో ఇక గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యంతో భారత మహిళల జట్టు బరిలోకి దిగింది. ఇక అనుకున్నట్లుగానే లీగ్ మ్యాచ్లలో బాగా రాణించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీ ఫైనల్లో దిగ్గజ ఇంగ్లాండ్ జట్టును ఓడించి చివరికి ఫైనల్ వరకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటిసారి కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ విభాగంలో గోల్డ్మెడల్ సాధించి భారత మహిళల జట్టు చరిత్ర సృష్టిస్తుంది అని అందరూ అనుకున్నారు.

 అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఓడిపోయి గోల్డ్ మెడల్ కి అడుగు దూరంలో ఆగిపోయి సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుంది. అయితే కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత జట్టు తరపున రేణుక సింగ్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. అయితే గ్రూప్ స్టేజ్ లో భారత్ పై ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికీ రేణుక సింగ్ ప్రదర్శన మాత్రం ప్రేక్షకులందరికీ గుర్తుండి పోయింది అని చెప్పాలి.. ఇక లీగ్ స్థాయిలో మిగిలిన రెండు మ్యాచ్ లలో కూడా రాణించి మొత్తంగా తొమ్మిది వికెట్లు తీసుకుంది. ఫైనల్ మ్యాచ్లో కూడా కీలకమైన రెండు వికెట్లు పడగొట్టి ఇక జట్టుకు మెరుగైన స్థానంలో ఉంచేందుకు ప్రయత్నించింది.

 కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా 11 వికెట్లు తీసి అదరగొట్టిన రేణుకా సింగ్ ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్ లో సత్తా చాటింది అనే చెప్పాలి.. ఏకంగా ఒక్కసారిగా 10 స్థానాలు ఎగబాకింది. మొన్నటి వరకూ మహిళల టి20 ర్యాంకింగ్స్ లో 28వ స్థానంలో కొనసాగిన రేణుక సింగ్ ఇటీవలి మంచి ప్రదర్శన కారణంగా పది స్థానాలు ఎగబాకి 18వ స్థానం సొంతం చేసుకుంది. ఇక టి20 ర్యాంకింగ్స్ లో భారత్ నుంచి దీప్తి శర్మ ఆరవ స్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. అయితే భారత మహిళల జట్టు తరఫునుంచి టాప్ టెన్ లో కేవలం  దీప్తి శర్మ ఒక్క ప్లేయర్ మాత్రమే అవకాశం దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: