ప్రతిసారి.. అదే మా కొంప ముంచుతోంది : హర్మన్ ప్రీత్

praveen
దశాబ్దాల నిరీక్షణ తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ అర్హత సాధించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహిళల టి20 టోర్నీ జరిగింది. అయితే టీ20 టోర్నీలో భాగంగా భారత మహిళల జట్టు మంచి ప్రదర్శన తో ఆకట్టుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్లో కూడా ఇంగ్లండ్ జట్టుపై ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో ఆస్ట్రేలియా పై విజయం సాధిస్తే ఇక బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడం ఖాయం అని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియా ముందు తడపడింది భారత జట్టు.

 విజయం కోసం చివరి వరకు పోరాడినప్పటికీ చివరికి 9 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సినా పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా మొదటి సారి క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టు గోల్డ్మెడల్ సాధించగా భారత్ సిల్వర్ మెడల్ సాధించింది. అయితే గత కొన్ని నెలల్లో భారత్ మెగా టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం ఇది మూడో సారి కావడం గమనార్హం. ఈ క్రమంలోనే మ్యాచ్ ఓటమి అనంతరం స్పందించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ .. చాలా సార్లు మెగా టోర్నీలో ఫైనల్ మ్యాచ్లో చేసిన తప్పులను ఇప్పుడు కూడా పునరావృతం చేశాము అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ టోర్నీ ఫైనల్స్లో ఇక ప్రతిసారీ మేము ఒకే రీతిలో తప్పులు చేస్తున్నాము. అది మేము మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

 ద్వైపాక్షిక  సిరీస్ లో ఈ తప్పులు చెయ్యము. కానీ ఎందుకో ఫైనల్ మ్యాచ్ లో తప్పులు చేస్తున్నాం అంటూ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది  ఇక చివరి ఆరు ఓవర్లు 50 పరుగులు అవసరమైన సమయంలో టీమిండియా గెలుపు ఖాయం అన్నట్లుగా కనిపించింది. కాని 13 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా మేము ఇప్పుడు జట్టులో నికార్సయిన బ్యాటర్ కోసం ఎదురుచూస్తున్నాము. దురదృష్టవశాత్తు మేము ఇంకా ఆ వెలితి తోనే  కొనసాగుతూ ఉన్నాం. అదృష్టవశాత్తు అదనపు బ్యాట్స్మన్ కలిగి ఉంటే వికెట్లు కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుంటాము అంటూ చెప్పుకొచ్చింది. అయితే గోల్డ్మెడల్ మిస్ అయినప్పటికీ జట్టు ప్రదర్శన పట్ల ప్రస్తుతం సంతోషంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: